డేటింగ్ యాప్ సీక్రెట్ చెప్పేసిన హాట్ బ్యూటీ!
ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా స్పందించింది.
By: Tupaki Desk | 27 Sep 2024 3:30 PM GMTడేటింగ్ యాప్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కొంత మంది ఉండటం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డేటింగ్ యాప్ లో వీళ్లకి పనేంటి? అని ఇండస్ట్రీ సహా జనాల్లోనూ చర్చకు దారి తీసింది. బీటౌన్ లో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. రాజ్ కుంద్రా లాంటి వ్యవరాలేవేనా నెరుపుతున్నారా? అన్నసందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా స్పందించింది.
`డేటింగ్ యాప్లో హృతిక్ రోషన్ , ఆదిత్యారాయ్ కపూర్ లతో పాటు చాలా మంది ఉన్నారు. మేము అంతా మాట్లాడుకోవడం కోసమే అందులో ఉన్నాం. మాటల కోసమే లాగిన్ అవుతాం. అందరం ఖాళీ సమయంలో కబుర్లు చెప్పుకుంటాం. విరామ సమయంలో ఒకరికొకరు రిక్వెస్ట్ లు పెట్టుకుంటాం. దాన్నిమరో కోణంలో చూడొద్దు` అని తెలిపింది. అయితే మాట్లాడుకోవడం కోసం వాట్సాప్ గ్రూప్ లు...ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు చాలా ఉన్నాయి.
ఒకరి దగ్గర మరొకరి ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు డేటింగ్ యాప్ లోనే ప్రత్యేకంగా మాట్లాడు కోవాల్సినం అవసరం ఏ ముంటుంది? యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో హాయ్ చెబితే తప్పా? మాట్లాడు కున్నట్లు ఉండదా? అంటూ ఊర్వశీ సమాధానాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పిన సమాధానం నమ్మేలా లేదు అంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. మరి నిజమేంటో ఆ పెరుమాళ్లకే తెలియాలి అటూ ఓయూజర్ పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బాలీవుడ్..టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 109వ చిత్రంలో నటిస్తోంది. బలమైన కథతో ఈ సినిమా వస్తుందని.. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంద ని అంది. అలాగే బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ఆయన గొప్పనటుడే కాదు..మంచి వ్యక్తి అంది. టాలీవుడ్ వాతావరణం ఎంతో బాగుంటుందని, మరిన్ని అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేసింది.