పింక్ బ్యూటీలో ఊర్వశి పేంపర్ చేస్తోందే
నులుగురి కి భిన్నంగా ట్రై చేసి సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంది.
By: Tupaki Desk | 30 Nov 2023 5:53 AM GMTఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ ఊర్వశి రౌతేలా రచ్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి ఎలివేషన్లకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్లేస్ ఎలాంటిదైనా అక్కడ ఊర్వశి మార్క్ పడాల్సిందే. అందుకు ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరిస్తుంది. నులుగురి కి భిన్నంగా ట్రై చేసి సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంది. ఎలాంటి దుస్తుల్లోనైనా అందాల వడ్డన తప్పనిసరిగా భావిస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఊర్శశి రౌతేలా మరో కొత్త ఫోటోతో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. పింక్ వర్ణం దుస్తుల్లో మెరిసిపోతుంది. గులాబీ రంగు అమ్మడిని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. కళ్లకి గ్లాసెస్ ధరించి..బీచ్ హెటల్స్ లో ఇలా కెమారికి ఫోజులి చ్చింది. చేతిలో చిలకాకు పచ్చ హ్యాండ్ బ్యాగ్ ముందు భాగంలో వేలాడదీసి దాచాల్సిన వాటిని దాచేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై అభిమానుల కామెంట్లు అంతే ఆసక్తికరం. ఎవరికి వారు తమదైన శైలిలో ఊర్వశి అందాన్ని పొగిడేస్తున్నారు. ఇక ప్రచార పరంగా ఊర్వశి అనుసరించే సోషల్ మీడియా స్ట్రాటజీ గురించి తెలిసిందే. వ్యక్తిగతంగా ప్రమోట్ అవ్వడానికి ఏదో విషయంలో తలదూ ర్చుతుంది. అలా కుదరకపోతే తానే ఓ వివాదాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ విషయంలో అమ్మడు పీహెచ్ డీనే చేసేసింది.
అలాగే కెరీర్ పరంగా దూకుడు చూపిస్తోంది. `వాల్తేరు వీరయ్య` తర్వాత వరుసగా రెండు..మూడు సినిమాల్లో ఐటం పాటల్లో ఛాన్స్ అందుకుంది. కానీ వాటి ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. అయినా అవేవి సొగసరి కెరీర్ డ్రా బ్యాక్ లా కనిపించలేదు. కొత్త అవకాశాలు బాగానే చేజిక్కించు కుంటుంది.