Begin typing your search above and press return to search.

గుండెకి ఈసీజీ తీస్తున్న‌ట్లు ఆఫోజేంటి?

ఇదోర‌క‌మైన థెర‌పీ అట‌. ఇదిగో ఇక్క‌డిలా ఊర్వ‌శి ని ఇలా పెషెంట్ లా రెడీ చేసి దుస్తులేసి...ఆమె కాళ్ల‌కు...న‌డుం బాగాలు ఎవో వైర్లు త‌గిలించారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 7:03 AM GMT
గుండెకి ఈసీజీ తీస్తున్న‌ట్లు ఆఫోజేంటి?
X

గుండెకి ఈసీజీ తీసే స‌మ‌యంలో డాక్ట‌ర్లు పేషెంట్ ని బెడ్ మీద నిటారుగా పొడుకోబెట్టి ఈసీజీ తాలుకా వైర్లు అన్ని శ‌రీరానికి అతికించి..వాటిని మోనిట‌ర్ కి ఎలా క‌నెక్ట్ చేస్తారో? తెలిసిందే. గుండె స‌క్ర‌మంగా ప‌నిచే స్తుందా? లేదా? అని తెలుసుకోవ‌డం కోసం ఈ ప‌రీక్ష చేస్తుంటారు. అందులో రిపోర్ట్ ని బ‌ట్టి గుండె ఎలా ప‌నిచేస్తుంది? అన్న‌ది నిర్దారిస్తారు. తాజాగా హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా కూడా అలాంటి ప‌రీక్షే చేయించు కున్న‌ట్లుంది.


కాక‌పోతే ఇది గుండెకి సంబంధించిన ఫ‌రీక్ష కాదు. ఇదోర‌క‌మైన థెర‌పీ అట‌. ఇదిగో ఇక్క‌డిలా ఊర్వ‌శి ని ఇలా పెషెంట్ లా రెడీ చేసి దుస్తులేసి...ఆమె కాళ్ల‌కు...న‌డుం బాగాలు ఎవో వైర్లు త‌గిలించారు. వాటిని మోనిట‌ర్ కి క‌నెక్ట్ చేసారు. దీన్ని ప్రెస్సోథెరపీ అంటారుట‌. శరీరం మొత్తాన్ని నిర్విషీకరణ చేస్తుందిట‌. శరీరం యొక్క శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుంది. త‌ర్వాత శ‌రీరంలో టాక్సిన్స్ తొలగిస్తారుట‌. ఈ థెర‌పీ ద్వారా బలమైన రోగనిరోధక వ్యవస్థ అభివృద్దిలోకి వ‌స్తుందిట‌.


మ‌రి అమ్మ‌డిలో ఇమ్యునిటీప‌వ‌ర్ బాగా త‌గ్గిందే ఏమో! ఇలా థెర‌పీల జోలికి వెళ్లింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తొలుత ఈ ఫోటో చూసిన వెంట‌నే ఊర్వ‌శి గుండెకి ఈసీజీ తీయించుకుంటుంద‌నున్నారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే అది ఈసీజీ కాదు...థెర‌పీ అని క్లారిటీ వ‌చ్చింది. ఇలాంటి థెర‌పీల‌తో కూడా బోలెడంత ప్ర‌చారం పొంద‌డం గ‌మ్మ‌త్తుగా ఉంది క‌దూ.

హీరోయిన్ ఏం చేసినా అది ప్ర‌చార‌మే. ఇన్ స్టా ఫోలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోసం దేన్ని వ‌ద‌ల‌డం లేదు. స‌మ‌యం చేతిలో చిక్కితే చాలే ఏ ప‌ని చేసినా అది సోష‌ల్ మీడియాలో లైవ్ అవుతుంది. అవ‌స‌రం మేర రికార్డెడ్ వీడియోని పోస్ట్ చేస్తున్నారు.