Begin typing your search above and press return to search.

నువ్వే ఒక వ‌జ్రానివి.. ఇక ఆ డైమండ్ జూకా ఎందుకు?

తాజా ఫోటోషూట్ కోసం రెడ్ క‌ల‌ర్ పంజాబీ కుర్తా ధ‌రించిన ఊర్వ‌శి కాంబినేష‌న్ గా ప‌చ్చ‌లు పొదిగిన ఖ‌రీదైన జూకాలు ధ‌రించింది.

By:  Tupaki Desk   |   29 July 2023 5:03 AM GMT
నువ్వే ఒక వ‌జ్రానివి.. ఇక ఆ డైమండ్ జూకా ఎందుకు?
X

బాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన ఊర్వ‌శి రౌతేలా క‌న్ను ఇప్పుడు సౌతిండ‌స్ట్రీపై పడిన సంగ‌తి తెలిసిందే. బోల్డ్ అండ్ డ‌స్కీ బ్యూటీగా యూత్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్న ఈ బ్యూటీ ప‌వ‌న్ క‌ల్యాణ్ - సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'బ్రో' చిత్రంలో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. ఊర్వ‌శి అంద‌చందాల‌కు మెగాభిమానులు ఫిదా అయిపోయారు. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య లాంటి మాస్ సినిమాలోను ఊర్వ‌శి స్పెష‌ల్ నంబ‌ర్ లో మెరిసింది. గోపిచంద్ చిత్రంలోను ఐటమ్ నంబ‌ర్ తో ఆక‌ట్టుకుంది. మునుముందు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో న‌టించాల‌నే త‌న అభిలాష‌ను ఈ భామ లైవ్ ఇంట‌ర్వ్యూల్లో వ్య‌క్తం చేసింది.





ఇదిలా ఉంటే ఊర్వ‌శి రౌతేలా సోష‌ల్ మీడియ‌లో చేసిన ఒక వ్యాఖ్య నెటిజ‌నుల్లో ట్రోలింగుకి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ సీఎం అంటూ వ్యాఖ్యానించి తీవ్ర‌మైన చ‌ర్చ‌కు తెర తీసింది.

కానీ ఇంత‌లోనే త‌న త‌ప్పును దిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించినా రిపీటెడ్ మిస్టేక్స్ కి మ‌ళ్లీ ట్రోలింగ్ ఎదుర్కొంది. ఊర్వ‌శికి రాజ‌కీయాలు తెలియ‌క‌పోయినా సినిమాల గురించి తెలుసు క‌దా! అంటూ నెటిజ‌నులు కౌంట‌ర్లు వేస్తున్నారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఊర్వ‌శి రౌతేలా అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న యువ‌త‌రం గుండెల్లో భ‌డ‌భాగ్నిని రాజేస్తోంది. తాజా ఫోటోషూట్ కోసం రెడ్ క‌ల‌ర్ పంజాబీ కుర్తా ధ‌రించిన ఊర్వ‌శి కాంబినేష‌న్ గా ప‌చ్చ‌లు పొదిగిన ఖ‌రీదైన జూకాలు ధ‌రించింది.

అంతేకాదు త‌న జూకా ఎంత అందంగా ఉందో అంటూ అభిమానుల‌కు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప‌చ్చ‌ని జూకాలకు జ‌త‌గా ప‌చ్చ‌ని స్టోన్ తో త‌యారు చేసిన అంగుళీకం.. దానికి కాంబినేష‌న్ గా గ్రీన్ క‌ల‌ర్ నెయిల్ పాలిష్ .. ఈ డెక‌రేష‌న్ చూస్తుంటే కాస్ట్యూమ్స్ మేక‌ప్ పై ఊర్వ‌శి ఎంత శ్ర‌ద్ధ పెడుతుందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఆ క‌ళ్ల‌కు ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ లెన్స్ ని ధ‌రించి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించేందుకు చాలా తాప‌త్రాయ‌ప‌డింది. మొత్తానికి సౌత్ - నార్త్ అనే విభేధం లేకుండా అన్నిచోట్లా ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది అంటే ఇంత ఎఫ‌ర్ట్ పెడుతుంది కనుకేన‌ని అంగీక‌రించాలి. ఊర్వ‌శి త‌దుప‌రి సౌత్ లో ఓ వెలుగు వెల‌గాల‌ని క‌ల‌లు కంటోంది. ఆ క‌ల‌లు నిజం కావాల‌నే ఆకాంక్షిద్దాం.