Begin typing your search above and press return to search.

అత్యాశకి వెళ్లను అంటోన్న బాస్ పార్టీ బ్యూటీ

మనిషి ఆశాజీవి అంటారు... రూపాయి ఉంటే ఇంకో రూపాయి కావాలి అనుకోవడం... కోటి ఉంటే ఇంకో కోటి కావాలి అనుకోవడం అనేది మానవ నైజం

By:  Tupaki Desk   |   20 Oct 2023 7:00 AM GMT
అత్యాశకి వెళ్లను అంటోన్న బాస్ పార్టీ బ్యూటీ
X

మనిషి ఆశాజీవి అంటారు... రూపాయి ఉంటే ఇంకో రూపాయి కావాలి అనుకోవడం... కోటి ఉంటే ఇంకో కోటి కావాలి అనుకోవడం అనేది మానవ నైజం. సినిమాల్లో కమెడియన్ గా చేసే వారు హీరోగా చేయాలి అనుకోవడం... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే నటి హీరోయిన్ అవ్వాలి అనుకోవడం చాలా కామన్ విషయం. కానీ నేను మాత్రం ఆశాజీవినే కానీ అత్యాశ జీవిని కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తోంది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.

ఈ అమ్మడు ప్రస్తుతం ఐటం సాంగ్స్ తో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో హిందీతో పాటు సౌత్ లో కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్ అనగానే ఎక్కువ శాతం ఈమె పేరే వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌, బ్రో మరియు స్కంద సినిమాల్లో తన ఐటం సాంగ్‌ తో సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పెంచి ప్రేక్షకుల్లో ఉత్సాహంను నింపిన విషయం తెల్సిందే.

తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో ఐటం సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో కొందరు హీరోయిన్ గా తమ సినిమాల్లో నటించాల్సిందిగా కోరుతూ నా వద్దకు వస్తున్నారు. ఇప్పటి వరకు నేను హీరోయిన్‌ గా నటించేందుకు ఏ ఒక్కరికి కూడా ఓకే చెప్పలేదు. నాకు హీరోయిన్ గా నటించే ఆసక్తి లేదు.

ప్రస్తుతం ఐటం సాంగ్స్ ను స్టార్‌ హీరోల సినిమా ల్లో చేస్తున్నాను. అదే హీరోయిన్ గా అయితే పెద్దగా ఫేమ్‌ లేని హీరోతో, చిన్న బ్యానర్‌ లో పెద్దగా గుర్తింపు లేని దర్శకుడితో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా లు ఎంత వరకు వర్కౌట్‌ అవుతాయో.. హీరోయిన్ గా ఎంత వరకు విజయాన్ని సొంతం చేసుకుని మరిన్ని ఆఫర్లు వస్తాయో తెలియదు. అందుకే హీరోయిన్‌ ఆఫర్లపై ఆసక్తి లేదు అంది.

ఊర్వశి రౌతేలా చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచించినట్లుగా అనిపిస్తోంది అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు మరియు ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హీరోయిన్ గా సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. ఊర్వశి కి కూడా ఉండే ఉంటుంది. అయితే స్టార్‌ హీరోల సినిమాల్లో, పెద్ద బ్యానర్‌ లో అవకాశాలు వస్తే అప్పుడు తప్పకుండా ఓకే చెప్పే అవకాశం ఉంది... కాని చిన్న ప్రాజెక్ట్‌ ల్లో చేయాలని మాత్రం ఆమెకు లేదు. ఇది మంచి కెరీర్ ప్లానింగ్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.