Begin typing your search above and press return to search.

NBK విక్ట‌రీ సంకేత‌మా ఇది ఊర్వశీ..!

ఇంత‌కుముందు ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ లో NBK 109లో తన పాత్రను ధృవీకరిస్తూ జిమ్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:00 AM GMT
NBK విక్ట‌రీ సంకేత‌మా ఇది ఊర్వశీ..!
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న NBK 109 చాలా ప్ర‌త్యేక‌త‌ల‌ను సంత‌రించుకుంది. ఈ చిత్రంలో యానిమ‌ల్ ఫేం బాబీ డియోల్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా, ఇదే చిత్రంలో బాలీవుడ్ హాట్ గాళ్ ఊర్వశి రౌతేలా అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ లో క‌నిపించ‌నుంది.


'వాల్తేరు వీర‌య్య‌'లో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి స్టెప్పులేసిన‌ ఊర్వశి రౌతేలా ఇప్పుడు నంద‌మూరి న‌య‌కుడితోను రేర్ ఛాన్స్ ద‌క్కించుకుంది. ఇది బాల‌య్య‌ ఫ్యాన్స్ లో ఎక్స్ ట్రా ఎన‌ర్జీని నింపే ప్ర‌య‌త్నం అన‌డంలో సందేహం లేదు. ఇంత‌కుముందు ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ లో NBK 109లో తన పాత్రను ధృవీకరిస్తూ జిమ్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. నంద‌మూరి ఫ్యాన్స్ కి ఊర్వ‌శి స్పెష‌ల్ ట్రీట్ ముందుంద‌ని క్లారిటీ వచ్చింది.

ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌తో క‌లిసి ఉన్న ఓ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్‌ని ఊర్వ‌శి రౌతేలా ఇంట‌ర్నెట్ లో షేర్ చేసారు. బాల‌కృష్ణ స‌ర్ తో ఎన్బీకే 109 సెట్స్ నుంచి..! అని హింట్ ఇచ్చారు ఊర్వ‌శి. అద్భుత‌మైన ఇంటీరియ‌ర్ తో స్టూడియోని త‌ల‌పిస్తున్న సెట్స్‌లో బాల‌య్య‌తో ఊర్వ‌శి స్మైలీ లుక్ క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతోంది. ముఖ్యంగా ఎన్బీకే త‌న చేతి వేళ్ల‌ను విక్ట‌రీ షేప్‌లో ఉంచి స్మైల్ ఇస్తుండ‌డం చూస్తుంటే, రేప‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆయ‌న‌ను విక్ట‌రీ వ‌రించ‌నుందన్న ధీమా క‌నిపిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్బీకే విక్ట‌రీ సంకేత‌మా ఇది ఊర్వ‌శీ? అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఈసారి ఎన్నిక‌ల్లో హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధిస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి స‌మయంలో ఊర్వ‌శి టైమింగ్లీ ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్బీకే 109 బాల‌య్య కెరీర్ లోనే యూనిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.