యూఎస్ బాక్సాఫీస్.. నాని మళ్ళీ అదే స్పీడులో..
సరిపోదా శనివారం సినిమాకి జరుగుతోన్న ప్రీమియర్ బుకింగ్స్ జోరు చూస్తుంటే కచ్చితంగా దసరా రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Aug 2024 2:11 PM GMTటాలీవుడ్ టైర్ 2 హీరోలలో ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడు అంటే నాచురల్ స్టార్ నాని అని చెప్పాలి. నాని మూవీ సక్సెస్ అయ్యిందంటే నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్స్ వస్తాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నాని సినిమాలకి చాలా అద్భుతంగా జరుగుతాయి. నానికి ఉన్న ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా అతని సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ఎన్నారైలు థియేటర్స్ లో చూడటానికి రెడీ అయిపోతారు.
అందుకే నాని సినిమాలకి భారీగా ఓపెనింగ్స్ వస్తాయి. నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమాకి సాలిడ్ బిజినెస్ జరిగింది. దసరా తర్వాత ఈ చిత్రంతో మరో సారి నాని 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని యూఎస్ లో ఇప్పటికే ఓపెన్ చేశారు. మొదటి రెండు రోజుల్లోనే యూఎస్ ప్రీమియర్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 200K డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయంట. ఇంకా రిలీజ్ కి నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో బుకింగ్ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నాని కెరియర్ దసరా సినిమా అత్యధికంగా ప్రీమియర్ షో బుకింగ్స్ ద్వారా అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంది.
దసరాకి ఏకంగా 637K డాలర్స్ కలెక్షన్స్ ని ప్రీమియర్స్ బుకింగ్స్ తో వచ్చాయంట. సరిపోదా శనివారం సినిమాకి జరుగుతోన్న ప్రీమియర్ బుకింగ్స్ జోరు చూస్తుంటే కచ్చితంగా దసరా రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే కచ్చితంగా నాని తన రికార్డ్ ని తానే మళ్ళీ బ్రేక్ చేసుకున్నట్లు అవుతుంది. యూఎస్ లో ప్రీమియర్స్ తో రికార్డ్ వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోగా నాని మరోసారి నిలుస్తాడు.
ఈ రేస్ లో టైర్ 2 హీరోలలో ఇంకెవరు ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే సరిపోదా శనివారం సినిమాతో దసరా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డ్ ని కూడా నాని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడంతో తమిళనాట కూడా మూవీకి మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.