Begin typing your search above and press return to search.

అయ్యో.. ఇద్దరికి డిజాస్టర్ వచ్చెనే..

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో శ్రీసింహ.

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:42 AM GMT
అయ్యో.. ఇద్దరికి డిజాస్టర్ వచ్చెనే..
X

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో శ్రీసింహ. యమదొంగ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించిన శ్రీసింహ మత్తు వదలరా మూవీతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. మొదటి సినిమా ఓ డిఫరెంట్ ప్రయత్నంగా వచ్చి సక్సెస్ అయ్యింది. ఈ మూవీతో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత హీరోగా నిలబడి ప్రయత్నం శ్రీ సింహా చేస్తూనే ఉన్నాడు.

అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తెల్లవారితే గురువారం అనే లవ్ అండ్ కామెడీ డ్రామాతో హీరోగా సెకండ్ సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. నెక్స్ట్ దొంగలున్నారు జాగ్రత్త అనే మూవీ చేశారు. ఇందులో కథ మొత్తం కారులోనే నడుస్తుంది. ప్రయోగాత్మకంగా వచ్చిన ఆ చిత్రం శ్రీసింహకి కెరియర్ పరంగా ఏ విధంగాను ఉపయోగపడలేదు.

ఈ ఏడాది క్రైమ్ కామెడీతో భాగ్ సాలె అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా ఉస్తాద్ టైటిల్ తో తెరకెక్కిన మూవీ మీద మాత్రం శ్రీసింహా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎమోషనల్ లైఫ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫైలెట్ కావాలని కలలుకనే ఓ సామాన్య యువకుడి కథగా దీనిని ఆవిష్కరించారు. తాజాగా ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసింది. నాని కూడా శ్రీసింహకి గట్టిగానే ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం ప్రీరిలీజ్ ఈవెంట్ తో చేశారు. అయితే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మరోసారి ఈ హీరోగా చేదు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. కంటెంట్ మెయిన్ లైన్ బాగున్నా దానిని నడిపించడానికి రాసుకున్న కథనం పరంగా డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. దీంతో స్లో పేజ్ లో సాగే డ్రామాగా ఈ మూవీ మిగిలిపోయింది.

మాసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి చైల్డ్ యాక్టర్ కావ్య కళ్యాణ్ రామ్ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది. తర్వాత బలగంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అయితే మూడో సినిమాగా వచ్చిన ఉస్తాద్ మాత్రం ఆమె ఖాతాలో డిజాస్టర్ లిస్టులో చేరింది. అటు శ్రీసింహకి కెరియర్ పరంగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఉస్తాద్ రూపంలో మరో డిజాస్టర్ వచ్చి పడింది.