పవన్ కోసం పవర్ఫుల్ విలన్
తమిళ యాక్టర్ ఆర్ పార్తీబన్‌ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్‌లో డైరెక్టర్‌గా యాక్టర్‌గా మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Sep 2023 2:53 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ అవ్వలేదు. మూవీ టీమ్ కూడా ఎటువంటి విషయం కూడా చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం విలన్ ఎవరనేది వివరాలు తెలిశాయి.
వివరాళ్లోకి వెళితే.. ఉస్తాద్ భగత్ సింగ్.. ఒరిజినల్ వెర్షన్ తేరిలో విలన్ రోల్‌ను మహేంద్రన్ చేశారు. అద్భుతంగా నటించారు. గతంలో ఓ సారి ఈ విలన్ పాత్ర కోసం తనను అడిగారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ ప్రతినాయకడి పాత్ర గురించి ఎటువంటి సమాచారం రాలేదు.
అయితే తాజాగా ఆ విలన్ రోల్ ఖరారు చేసినట్టుగా సమాచారం అందింది. అప్పుడు గబ్బర్ సింగ్ కోసం అభిమన్యు సింగ్‌ను తీసుకున్న హరీశ్ ఈ సారి కూడా అలానే ఫ్రెష్ ఫేస్‌ను తీసుకొస్తున్నారట. తమిళ యాక్టర్ ఆర్ పార్తీబన్‌ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్‌లో డైరెక్టర్‌గా యాక్టర్‌గా మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు.
ఈయన తెలుగులో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో కనిపించారు. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని కొన్ని సన్నివేశాల్లో. ఫుల్ లెన్త్ రోల్ కాదు. అయితే ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్‌లో మాత్రం ఎక్కువ స్పేస్ కనిపించనున్నారట. హరీశ్ శంకర్ ఆయన విలన్ రోల్‌ను ఫుల్ లెంగ్త్‌లో డిజైన్ చేశారట.
వాస్తవానికి డబ్బింగ్ చిత్రాలు చూసేవారి.. పార్తీబన్ సుపరిచితుడే. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్‌లోనూ కనిపించారు. తెలుగులో బండ్ల గణేశ్ నటించిన డేగల బాబ్లీ ఒరిజినల్ వెర్షన్ కూడా ఈయనే చేశారట. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైతే సంక్రాంతి లేదా ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.