Begin typing your search above and press return to search.

గోపీచంద్ ను వదిలేసిన ప్రభాస్ టీమ్?

ప్రభాస్ స్నేహితులకు సంబంధించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుగా సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   23 Nov 2024 11:30 AM GMT
గోపీచంద్ ను వదిలేసిన ప్రభాస్ టీమ్?
X

యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్ చివరిగా ‘విశ్వం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. గత కొంతకాలంగా గోపీచంద్ కి సరైన సక్సెస్ పడలేదు. ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ‘లౌక్యం’ మూవీతో 2014లో గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత ‘గౌతమ్ నంద’, ‘సిటీమార్’, ‘భీమా’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి.

మిగిలిన సినిమాలు ఏవీ కూడా మెప్పించలేదు. అయితే ఆయనకున్న మాస్ ఇమేజ్ కారణంగా నిర్మాతలు గోపీచంద్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ ‘జిల్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల దర్శకుడు రాధాకృష్ణతో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాపై గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ స్నేహితులకు సంబంధించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుగా సిద్ధమైంది.

అయితే యూవీ క్రియేషన్స్ వారికి రీసెంట్ గా ‘కంగువా’తో పెద్ద దెబ్బ పడింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘విశ్వంభర’ మీద యూవీ క్రియేషన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ సినిమా 2025 మేలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగి రిలీజ్ అయితే కానీ వేరొక సినిమాని యూవీ వాళ్ళు చేసే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే అఖిల్ తో చేయాల్సిన 100 కోట్ల ప్రాజెక్టును కూడా హోల్డ్ లో పెట్టారు.

ఇక గోపీచంద్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ను ఆల్ మోస్ట్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితిలో యూవీ క్రియేషన్స్ వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని 70 ఎం ఎం ప్రొడక్షన్ టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తోనే గోపీచంద్ మూవీ తెరకెక్కనుంది. అందుకే యూవీ వారు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

ఈ సినిమాపై సోలోగా కాకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మిస్తోంది. ‘విశ్వంభర’ రిలీజ్ తర్వాత వేరే సినిమా ఏదైనా యూవీ వాళ్ళు మొదలుపెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే ప్రభాస్ కి ఈ మధ్యకాలంలో వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ఇది ఒకటిగా ఉంది. అయిన కూడా యూవీ క్రియేషన్స్ రాధాకృష్ణతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఆర్ధిక కారణాల వలన ఇప్పుడు గోపీచంద్ తో చేయాల్సిన ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చినట్లు టాక్.