చిరు-అఖిల్ తో UV సాహసం.. ఏమవతుందో!
సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ చిత్రంలోని కాస్ట్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు కొత్త నిర్మాతలు సిద్ధమవుతుంటారు
By: Tupaki Desk | 26 Aug 2023 3:00 AM GMTసాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ చిత్రంలోని కాస్ట్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు కొత్త నిర్మాతలు సిద్ధమవుతుంటారు. వారితో మరింత హై క్వాలిటీ, కంటెంట్ ఉన్న కథలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే డిజాస్టర్ టాక్ అందుకుంటే వారితో కలిసి పని చేసేందుకు రిస్క్ గా భావించి కాస్త ఆలోచిస్తుంటారు. అయితే ఇలా అందరి విషయంలో ఎప్పుడూ ఒకేలా జరగదు. స్టార్ ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంటాయి.
అయితే విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ విషయంలో యాదృశ్చికమో మరేమో గానీ ఒకేలా జరుగుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా 'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మెహెర్ రమేశ్ దర్శకత్వంలో తమన్న, కీర్తి సురేశ్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం చిరు కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ఏజెంట్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అఖిల్ తీవ్రంగా మునుపెన్నడు లేని విధంగా కష్టపడినప్పిటకీ.. ఫలితం లేకుండా పోయింది.
ఈ రెండు సినిమాలను ఏకే బ్యానర్స్ ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఈ రెండు చిత్రాలు అనిల్ సుంకరకు భారీ నష్టాన్ని చేకూర్చాయి. ఇప్పుడు చిరంజీవి, అఖిల్.. ఇద్దరూ తమ కొత్త చిత్రాలను సెట్స్ పై తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరు.. రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కించబోతున్న కొత్త చిత్రం మెగా 157. ఇప్పటికీ పంచభూతాల కాన్సెప్ట్ లో రిలీజైన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ గా రానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.
ఇక అఖిల్ కూడా తన కొత్త సినిమా 'అఖిల్ 6' కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడిగా పరిచయం కానున్న అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారని తెలిసింది. దీనిని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే ప్రొడ్యూస్ చేయనుండటం విశేషం. అలాగే ఈ చిత్రం కూడా సోషియో ఫాంటసీగా రాబోతుందట. అలా ఈ రెండు హీరోల గత చిత్రాలను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ రూపొందించి నష్టాలను అందుకోవడం, ఇప్పుడు కొత్త చిత్రాలను ఒకే తరహా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
భోళాశంకర్, ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ల తర్వాత ఒకే కాన్సెప్ట్ తో రానున్న ఈ ఇద్దరు హీరోల చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో? యూవీ క్రియేషన్స్‌ను ఎలాంటి లాభాలు తెచ్చిపెడతాయో చూడాలి...