Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కపూర్‌ బ్యూటీ పొడుగు కాళ్ల అందం చూశారా!

అలాంటి వాణి కపూర్‌ లో యాంగిల్‌లో తన కాళ్ల అందాన్ని చూపిస్తూ కన్నుల విందు చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా ఉందా... ముద్దుగుమ్మ ఫోటోకి లక్షల లైక్స్ రావాల్సిందే.

By:  Tupaki Desk   |   4 Feb 2025 6:04 AM GMT
పిక్ టాక్ : కపూర్‌ బ్యూటీ పొడుగు కాళ్ల అందం చూశారా!
X

బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయ్యింది. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ ఏడాది వాణి కపూర్‌ నుంచి మూడు భారీ బడ్జెట్‌ సినిమాలు రాబోతున్నాయి. ముద్దుగుమ్మ మూడు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించడం ద్వారా ఈ అమ్మడు తన స్థాయిని మరింత పెంచుకోబోతుంది. టాలీవుడ్‌లో ఈమె కేవలం ఒకే ఒక్క సినిమా ఆహా కళ్యాణం సినిమాలో కనిపించింది. నాని హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో మళ్లీ సౌత్‌లో ఈ అమ్మడు కనిపించడం లేదు. బాలీవుడ్‌కే ఈ అమ్మడు పరిమితం అయ్యింది.


సౌత్‌లో ఈమె సినిమాలు రాకున్నా సోషల్‌ మీడియాలో ఫోటోలతో అన్ని చోట్ల వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 8 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న వాణి కపూర్‌ రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. మూడు పదుల వయసు దాటినా పాతికేళ్ల పడుచు అందాలతో వాణి కపూర్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదంటూ నెటిజన్స్ ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.


సాధారణంగానే వాణి కపూర్‌ని పొడుగు కాళ్ల సుందరి అంటారు. అలాంటి వాణి కపూర్‌ లో యాంగిల్‌లో తన కాళ్ల అందాన్ని చూపిస్తూ కన్నుల విందు చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా ఉందా... ముద్దుగుమ్మ ఫోటోకి లక్షల లైక్స్ రావాల్సిందే. ఈ ఫోటోను వాణి కపూర్ షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే వేలల్లో లైక్స్‌, షేర్స్ దక్కాయి. తన పొడుగు కాళ్ల అందంను ఇలా చూపించడం ద్వారా మరింత ఈ అమ్మడు పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇంతటి అందంకు ఇన్నాళ్లు ఎందుకు ఆఫర్లు రాలేదు అనేది ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. ఇకపై అయినా ఈమె వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ కోరుకుంటున్నారు.


వాణి కపూర్‌ తాజా ఫోటోలతో మరోసారి వార్తల్లో నిలిచింది. పొడుగు కాళ్లతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించే ఈ అమ్మడు మరోసారి అదే తరహాలో తన అందంతో కన్నుల విందు చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడు రైడ్‌ 2, అబీర్‌ గులాల్‌ సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటితో పాటు బడ్డమీజ్ గిల్ సినిమాలోనూ వాణి కపూర్ నటిస్తోంది. పలు అవార్డులు రివార్డులు అందుకున్న ఈ అమ్మడు ఓటీటీ ఎంట్రీకి సైతం ఆసక్తి చూపిస్తుంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి ఒక వెబ్‌ సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.