Begin typing your search above and press return to search.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వధువు"

పెళ్లయ్యాక అత్తారింట్లో ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు - ఒక అమ్మాయి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో చెప్పే ఓ ఇందు కథ "వధువు".

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:55 AM
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వధువు
X

పెళ్లయ్యాక అత్తారింట్లో ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు - ఒక అమ్మాయి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో చెప్పే ఓ ఇందు కథ "వధువు". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఈ ఊహించని పరిణామాల కుటుంబ కథ సంచలనం సృష్టిస్తోంది.

అత్తారింట్లో ఒక్కొక్కరు మనుషుల్లా కాకుండా ఒక్కో ప్రశ్నలా కనిపిస్తుంటే ఆమె ఏం చేసింది? నీడలా వెంటాడుతున్న సంఘటనల నుంచి ఎలా తప్పించుకుంది? అసలు తన ప్రాణానికే ముప్పు వాటిల్లితే తనని తాను ఎలా కాపాడుకుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వధువు" చూడాల్సిందే.

పెళ్లి గురించి.. పెళ్లి సంప్రదాయాల గురించి.. దానికి సంబంధించిన లాంఛనాల గురించి అన్యమనస్కంగా వుండే ఇందు కి ఈ పెళ్ళికి ముందు ఓ గతం వుంది. ఆ గతం మిగిల్చిన చేదు అనుభవాలు ఇందుని వెంటాడుతుంటే - ఇప్పుడు జరిగిన మరోసారి ఈ పెళ్ళి వెనుక వున్న దాగిన ఎన్నో రహస్యాలు, వాటి పర్యవసానాలు ఏమిటి అనేదే "వధువు"ని మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోస్ట్రీమింగ్ అవుతున్న"వధువు" ని తప్పనిసరిగా చూడండి. "చిన్నారి పెళ్లికూతురు"గా స్టార్ మా ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన అవికా గోర్ ఇప్పుడు "వధువు"గా సంచలనం సృష్టిస్తోంది. తన హావభావాలతో ఇందు గా అలరిస్తోంది.

"వధువు" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3Ni5d4L

Content Produced by: Indian Clicks, LLC