లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై వైరముత్తు కన్నెర్ర!
మహిళలకు సమానత్వం కల్గించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయినప్పుడే అది మంచి కాలం అని.. అలాంటి కాలాన్ని గణేష్ బాబు` కట్టిల్` చిత్రం తో తీసుకొచ్చారని అన్నారు.
By: Tupaki Desk | 9 Nov 2023 12:30 AM GMTనేటి జనరేషన్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై కోలీవుడ్ స్టార్ రైటర్ వైరాముత్తు కన్నెర్రజెసారు. పాత సినిమా పోస్టర్లు చూస్తుంటే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవగా ఉండేవన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాముఖ్యత నిచ్చే చిత్రాలు చూడగల్గుతున్నామా? ఆ సినిమాలు అందరూ చూసేలా తీస్తున్నారా? అని ఆవేదన వ్యక్తం చేసారు. మహిళలకు సమానత్వం కల్గించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయినప్పుడే అది మంచి కాలం అని.. అలాంటి కాలాన్ని గణేష్ బాబు` కట్టిల్` చిత్రం తో తీసుకొచ్చారని అన్నారు.
గణేష్ బాబు కథానాయకుడిగా స్వీయా దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి వైరాముత్తు పాటలు అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని నవంర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహిచిన ఆడియో కార్యక్రమంలో వైరాముత్తు పై విధంగా స్పందించారు. కోలీవుడ్ లో వైరాముత్తు పేరున్న రచయిత. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు అందించారు.
మణిరత్నం..శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు ఎక్కువగా పనిచేసేవారు. అయితే ఇప్పుడు వారంతా కొత్త తరం టీమ్ తో ముందుకెళ్తున్నారు. చాలా అరుదుగానే వాళ్లతోనే వైరాముత్తు పనిచే స్తున్నారు. ఆ మధ్య వైరాముత్తుపై గాయని చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి దేశ వ్యాప్తంగా ఎంత సంచలన మైందో తెలిసిందే. ఈ విషయంలో వైరాముత్తుపై కొంత వరకూ నెగిటివిటీ ఎక్కువైంది.
అప్పటి నుంచి ఆయన మీడియాలో పెద్దగా కనిపించలేదు. ఆయన సినిమా ఈవెంట్లకు హాజరవ్వడం కూడా చాలా అరుదు. బాగా కావాల్సిన వాళ్లు అయితే తప్ప పంక్షన్లకు హాజరు కారు. కట్టిల్ టీమ్ సభ్యులు వైరాముత్తుకు కావాల్సిన వాళ్లు కావడంతోనే అటెండ్ అయినట్లు తెలుస్తోంది.