స్టన్నింగ్ లుక్ లో వైష్ణవి.. వేరే లెవెల్ అంతే!
వైష్ణవి అంధలే.. ఎవరీ బ్యూటీ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యూజర్స్ లో అనేక మందికి ఆమె తెలిసే ఉంటుంది.
By: Tupaki Desk | 20 Dec 2024 8:30 AM GMTవైష్ణవి అంధలే.. ఎవరీ బ్యూటీ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యూజర్స్ లో అనేక మందికి ఆమె తెలిసే ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫిక్స్ తో సందడి చేసి ఆ మరాఠీ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. వచ్చిన అవకాశాలను అందుకుంటూ సత్తా చాటుతోంది వైష్ణవి.
అయితే ముంబైకు చెందిన మల్టీ టాలెంటెడ్ వైష్ణవి.. మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఓవైపు షార్ట్ ఫిల్మ్స్.. మరోవైపు కమర్శియల్ యాడ్స్ లో కనిపించి మెప్పించింది. 2019లో మిస్ ఇండియా మహారాష్ట్ర కిరీటాన్ని గెలుచుకున్న ఆమె.. ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది.
ఫెమినా మిస్ ఇండియా పోటీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన వైష్ణవి.. రెండు అవార్డులను గెలుచుకోవడం విశేషం. మిస్ ఫోటో జెనిక్, మిస్ బ్యూటిఫుల్ హెయిర్ క్యాటగిరీస్ లో సత్తా చాటిన ఆమె.. దేశంలోని టాప్ 12 మోడల్స్ లో ఒకరు. అదే సమయంలో లాయర్ గా పట్టా అందుకుని అన్ని రంగాల్లో తోపేనని ప్రూవ్ చేసుకుంది!
అయితే వైష్ణవి అటు యాక్టింగ్ పై ఫోకస్ పెడుతూనే.. ఇటు సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. మంచి టాలెంట్ ఉన్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అయిన ఆమె.. యూట్యూబ్ ఛానెల్ ను మెయింటైన్ చేస్తోంది. అలా లాయర్, యాక్టర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వైష్ణవి మల్టీ టాలెంటెడ్.
అదే సమయంలో నెట్టింట అందాలను ఆరబోస్తూ ట్రెండ్ లో ఉంటోంది వైష్ణవి. కొత్త కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ మాయ చేసే ఆమె.. డైలీ తన సోషల్ మీడియా వాల్ చెక్ చేయాలనే సందడి చేస్తుంటోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ కు కేరాఫ్ అడ్రెస్ ఆమె! తాజాగా స్పెషల్ డ్రెస్ లో దిగిన కొత్త పిక్స్ షేర్ చేసి.. క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది అమ్మడు.
వైట్ కలర్ సూట్ వేసుకున్న ముద్దుగుమ్మ.. తన స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి. ఒక్క పిక్ లో వేరే లెవెల్ పోజ్ ఇచ్చి ఫ్లాట్ చేస్తోంది. ప్రస్తుతం వైష్ణవి స్టన్నింగ్ పిక్స్.. తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడు సూపర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.