లేడీ జాక్ క్రేజీ లుక్స్.. బేబీ ఫెస్టివల్ వైబ్ అదుర్స్..!
శారీ లో తన క్యూట్ లుక్స్ తో చూపు మరల్చ లేనంతగా కవ్విస్తుంది వైష్ణవి.
By: Tupaki Desk | 31 Oct 2024 9:30 AM GMTబేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. అమ్మడు ముందు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి ఫైనల్ గా హీరోయిన్ అయ్యింది. ఐతే బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కెరీర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకుంటే బేబీ హిట్ పడ్డాక అమ్మడికి ఫ్లాప్ రుచి తగిలింది. ఆశిష్ తో లవ్ మీ సినిమా చేసిన వైష్ణవి చైతన్య ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసింది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి చెప్పడం కష్టం ఐతే ఎంచుకున్న పాత్రలను బట్టి సినిమా రిజల్ట్ మీద డిపెండ్ అవ్వకుండానే హీరోయిన్స్ క్రేజ్ వస్తుంది.
బేబీతో వైష్ణవి పేరు మారు మోగిపోయింది. లవ్ మీ ఫ్లాప్ అయినా ప్రస్తుతం అమ్మడి స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాలో నటిస్తుంది. వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాలంటే జాక్ కంపల్సరీ హిట్ కొట్టాల్సిందే. ఐతే జాక్ సినిమా అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు కానీ దీపావళి సందర్భంగా వైష్ణవి నో ఫిల్టర్స్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. కథానాయికలు తమ న్యాచురల్ లుక్ తో కనిపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.
పండుగ రోజు అనవసరమైన మేకప్ ఎందుకు అనుకుందో ఏమో కానీ బేబీ వైష్ణవి చైతన్య న్యాచురల్ లుక్స్ అదిరిపోయింది. పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అనేలా అమ్మడు తన లుక్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమధ్య ప్రతి ఒక్కరు మేకప్ లేకపోయినా ఫిల్టర్స్ వాడి మరీ బాగా అందంగా కనిపించాలని ట్రై చేస్తున్నారు. కానీ బేబీ వైష్ణవి మాత్రం తన సహజత్వంతో ఆకట్టుకుంటుంది. బేబీ షేర్ చేసిన ఈ మేకప్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీ లో తన క్యూట్ లుక్స్ తో చూపు మరల్చ లేనంతగా కవ్విస్తుంది వైష్ణవి.
వైష్ణవి చైతన్య ఫెస్టివల్ వైబ్ ఫోటోలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటోల కింద రకరకాల కామెంట్స్ తో ఆమెపై ప్రేమ కురిపిస్తున్నారు ఆడియన్స్. పండగ రోజు గుండెల్లో మోత మోగించేందుకు వైష్ణవి షేర్ చేసిన ఈ ఫోటో షూట్ అంటూ క్రేజీ కామెంట్స్ తో వీటిని వైరల్ చేస్తున్నారు. జాక్ తో హిట్ పడితే వైష్ణవి మళ్లీ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి అమ్మడు ఈ సినిమాతో అనుకున్న రేంజ్ హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.