Begin typing your search above and press return to search.

బేబీ చాలా కాన్ఫిడెంట్ గా ఉందిగా..!

షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ సీరీస్ లు చేసి ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటింది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 2:45 AM GMT
బేబీ చాలా కాన్ఫిడెంట్ గా ఉందిగా..!
X

షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ సీరీస్ లు చేసి ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటింది. ఇంతకుముందు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసిన ఈ అమ్మడు బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తొలి సినిమాతో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం మిగతా వారికి ఎంకరేజింగ్ గా ఉంటుందని అనిపించింది. ఐతే బేబీ తర్వాత వైష్ణవి కెరీర్ మాత్రం ఆశించిన విధంగా లేదని చెప్పొచ్చు. బేబీ హిట్ తో ఐదారు సినిమాల ఛాన్స్ లు వస్తాయని ఊహించగా ఆ రేంజ్ రాలేదు.

మరోపక్క చేసిన లవ్ మీ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దాని వల్ల బేబీ వల్ల వచ్చిన క్రేజ్ కన్నా లవ్ మీ ఫ్లాప్ వల్ల వచ్చిన బ్యాడ్ టాక్ వైష్ణవి చైతన్య కెరీర్ మీద పడింది. ఐతే ప్రస్తుతం అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమా చేస్తుంది. ఈ సినిమా విషయంలో అమ్మడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. జాక్ సినిమా టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు.

ఐతే లవ్ మీ ఇచ్చిన షాక్ వల్ల బేబీ వైష్ణవి కెరీర్ ఇప్పుడు సిద్ధు జాక్ మీద ఆధారపడి ఉంది. ఆ సినిమా సక్సెస్ అయితేనే అమ్మడికి మరిన్ని ఛాన్స్ లు వస్తాయి. ఒకవేళ అది తేడా కొడితే మాత్రం కెరీర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. ఐతే వైష్ణవి చైతన్య మాత్రం జాక్ సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది. టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ సెన్సేషన్ అనిపించుకున్న సిద్ధు నుంచి నెక్స్ట్ వస్తున్న సినిమా జాక్ కాబట్టి ఆ సినిమాను కూడా టిల్లు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలానే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ జాక్ సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. భాస్కర్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది. మరి జాక్ తో వైష్ణవి కోరుకుంటున్న హిట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి. బేబీతో వచ్చిన క్రేజ్ తో ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా ఓకే చేయకుండా బేబీ వైష్ణవి ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఐతే అమ్మడి కెరీర్ లో మరో హిట్ పడితేనే కానీ వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.