వైష్ణవి చైతన్య.. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్!!
టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి అందరికీ తెలిసిందే. టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో కచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడంలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.
By: Tupaki Desk | 1 March 2025 4:00 AM ISTటాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి అందరికీ తెలిసిందే. టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో కచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడంలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. లవ్ ఇన్ 143 అవర్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి పలు సిరీసులతో అలరించింది.
అలా వివిధ వెబ్ సిరీసులతో యూత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అదే సమయంలో సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేసిన అమ్మడు.. టచ్ చేసి చూడుతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గీత గోవిందం, అల వైకుంఠపురంలో, టాక్ జగదీశ్, వరుడు కావలెను వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది బ్యూటీ.
ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె సుడి తిరిగిందని చెప్పాలి. బేబీ మూవీ హీరోయిన్ గా ఛాన్స్ వైష్ణవి సొంతమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు హార్ట్ అండ్ సోల్ ఆమెనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అంతలా తన యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
రూ.100 కోట్లు సాధించిన ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు ఒక్కసారిగా క్రేజీ బ్యూటీ గా మారిపోయింది. పలు సినిమా అవకాశాలు దక్కించుకుని నటిస్తోంది. అదే సమయంలో వైష్ణవి చైతన్యకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిజానికి.. వైష్ణవి బర్త్ డే రోజు పెట్టిన పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ఒక్కో పిక్ వేరే లెవెల్ లో ఉంది. ప్రతి ఫోటోలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తన గ్లామరస్ స్కిన్ టోన్ తో ఫిదా చేస్తుంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో క్లీన్ బౌల్డ్ చేస్తుందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ప్రస్తుతం వైష్ణవి పిక్స్ ఉన్న పోస్ట్ పై నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. బేబీ బ్యూటీ సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందమే అసూయ పడుతుందేమోనని ఆకాశానికెత్తేస్తున్నారు. అమ్మడు పిక్స్ అదిరిపోయాయని అంటున్నారు. అట్రాక్ట్ అయిపోతున్నామని చెబుతున్నారు. సో నైస్ మేడమ్ అంటూ సందడి చేస్తున్నారు నెటిజన్లు.. వైష్ణవి అభిమానులు..