చీరకట్టులో అందాల బేబీ.. సో బ్యూటీఫుల్
తన గ్లామర్‌తో పాటు, స్టైలిష్ హావభావాలతో కుర్రకారును కనులవిందు చేసింది.
By: Tupaki Desk | 7 March 2025 10:36 PM ISTసోషల్ మీడియాలో తరచుగా తన అందమైన లుక్స్‌తో ఆకట్టుకునే వైష్ణవి చైతన్య ఈసారి చీరకట్టులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌తో అదరగొట్టే వైష్ణవి, ఈసారి పింక్ అండ్ గోల్డెన్ కలర్ సిల్క్ చీరలో సంప్రదాయ అందాన్ని హైలెట్ చేసింది. తన గ్లామర్‌తో పాటు, స్టైలిష్ హావభావాలతో కుర్రకారును కనులవిందు చేసింది. ఆమె ఈ లుక్‌లో దిగిన ఫోటోలు వైరల్ అవుతుండటం విశేషం.
చీరకట్టులో వైష్ణవి అందానికి అందమైన హెయిర్ స్టైల్, నాజూకైన చెవిపోగులు, సింపుల్ జ్యువెల్రీ మరింత హైలైట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆమె చూపు, హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫోటోషూట్‌లో ఆమె క్లాస్ అండ్ గ్రేస్‌ను మిక్స్ చేసి అదిరిపోయే పోజులతో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌కి మరో అర్థం చెప్పింది. ఫోటోలలో ఆమె కళ్లలో కనిపించే కాన్ఫిడెన్స్, లుక్‌లో ఉండే అందం ఆమెను ట్రెడిషనల్ గర్ల్‌గా నిలబెట్టాయి.
సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు క్షణాల్లోనే ట్రెండ్ అయ్యాయి. నెటిజన్లు ‘ఈ లుక్‌లో మరింత అందంగా కనిపిస్తున్నావు’ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఆమె ఈ చీరకట్టును ఎంతో సొగసుగా మెలిపెట్టుకున్న తీరు మరింత అందంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక వైష్ణవి కెరీర్ విషయానికి వస్తే, అల..వైకుంఠపురములో సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న అమ్మడు ఆ తరువాత పలు వెబ్ సీరీస్ లతో కూడా క్రేజ్ అందుకుంది.
ఇక ‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జాక్ అనే సినిమాతో బిజీగా ఉన్న వైష్ణవి మరో న్యూ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఆమెకు గతంలో కంటే చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. మరి రాబోయే సినిమాలు అమ్మడికి ఎలాంటి క్రేజ్ ను తీసుకు వస్తాయో చూడాలి.