వైష్ణవి ఆశలన్నీ నెరవేరేనా?
యూట్యూబర్లుగా..షార్ట్ ఫిల్మ్ నటులుగా కొనసాగుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. వైష్ణవి సక్సెస్ అలాంటి వాళ్లకి ఓ స్పూర్తి అని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 19 July 2023 10:38 AM GMTతెలుగమ్మాయి వైష్ణవి 'బేబి' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మడు తొలి సినిమాతోనే యువతలో దూసుకుపోతుంది. బేసిక్ గానే సోషల్ మీడియాలో పాపులర్ అయిన బ్యూటీ కావడం సహా 'బేబి'తో వచ్చిన గుర్తింపుతో మరింత ఫేమస్ అయింది. 'బేబి' లో వైష్ణవి ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం అందుకు ప్రధానకారణమన్నది తెలిసిందే. మొత్తంగా డెబ్యూ సినిమాతో తెలుగ మ్మాయి ఈ రేంజ్ లో గుర్తింపు రావడం విశేషమనే చెప్పాలి.
సినిమాలపై ఎంతో ఫ్యాషన్ తో ఉన్న అమ్మాయి. పదేళ్ల పాటు అవకాశం కోసం ప్రయత్నించిగా వచ్చిన అవకాశమిది. ఆ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ అయింది. అయితే వైష్ణవి ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఇండస్ట్రీలో లాంగ్ కెరీర్ ని కోరుకుంటుందని తెలుస్తోంది.
ఏదో చేసాం...వెళ్లిపోయాం అని కాకుండా తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా గర్వపడే స్థాయికి చేరతానని ధీమా వ్యక్తం చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రుల సహకారం వైష్ణవి కి ఎంతో ఉంది.
సాధారణంగా ఏ తల్లిదండ్రులు సినిమాలంటే ప్రోత్సహించరు. అందులోనూ బేబి లాంటి పాత్ర పోషిస్తానంటే? అస్సలు ఒప్పుకోరు. ఈ విషయంల్ నార్త్ హీరోయిన్ల తల్లిదండ్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. కానీ వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం ఎంతో మెచ్యురిటీతో కుమార్తెని ప్రోత్సహించి తన ఎదుగుదలకు దోహదం చేసిన వారయ్యారు. అమ్మడు విజయంతో ఎలాగూ అగ్ర దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించింది.
సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రీసెంట్ గా సుకుమార్ కూడా సినిమా పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇలాంటి ప్రశంసలెన్నో నిర్మాతల నుంచి వచ్చాయి.
అయితే ఇప్పుడు వీళ్లంతా ప్రోత్సహిస్తేనే వైష్ణవి అనుకున్నది సాధించగలదు. అది ప్రశంసగానే పరిమితం కాకుండద అవకాశాలు కల్పించి తెలుగు నటులకు పెద్ద పీట వేసినప్పుడే! మరింత మంది తెలుగు నటులు ముందుకొచ్చే అవకాశం ఉంది.
వైష్ణవి లా అవకాశం దొరికితే నిరూపించుకోవాలని చాలా మంది హైదరాబాద్ లో తిష్ట వేసి కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. యూట్యూబర్లుగా..షార్ట్ ఫిల్మ్ నటులుగా కొనసాగుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. వైష్ణవి సక్సెస్ అలాంటి వాళ్లకి ఓ స్పూర్తి అని చెప్పొచ్చు.