వైష్ణవి మైండ్ లో ఫిక్సైంది.. బ్లైండ్ గా చేసేసింది!
ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం
By: Tupaki Desk | 17 July 2023 11:58 AM GMTఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం...ఘాడమైన పెదవి ముద్దు సన్నివేశాలో నటించడం అన్నది పరాయి రాష్ట్ర భామలకే చెల్లిందని ఓ లెక్క ఉంది. ఇలాంటి సన్నివేశాల్లో ఢిల్లీ.. ముంబై బ్యూటీలు..బెంగుళూరు భామలో ఎక్కువగా కనిపిస్తుంటారు. డైరెక్టర్లకు కూడా వాళ్లు అయితే కంపర్ట్ బుల్ గా ఉంటుందని తమ పాత్రలకి వాళ్లనే ఏరికోరి మరీ తెస్తుంటారు. తాజాగా తెలుగు అమ్మాయి వాళ్లకి ఏ మాత్రం తీసిపోకుండా నటించి ఇప్పుడు నెట్టింట సంచలనమవుతోంది.
ఆమె 'బేబి' హీరోయిన్ వైష్ణవి చైతన్య. కొన్నేళ్ల పాటు అవకాశాలు కోసం పోరాటం చేయగా బేబి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. రాకరాక వచ్చిన అవకాశం తన ట్యాలెంట్ చూపించాలని డిసైడ్ అయింది. ఆ రకంగా ముందుకెళ్లి సక్సెస్ అయింది.
ఇటీవలే రిలీజ్ అయిన సినిమా యువతలోహాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమ్మడి రొమాంటిక్ పెర్పార్మెన్స్ కి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఇంటిమేట్ సన్నివేశాల్లో ఇలా నటించింది తెలుగు అమ్మాయేనా? అని చర్చించుకునే రేంజ్ లో నెట్టింట సహా మీడియాలోనూ చర్చకొచ్చింది.
ఈ విషయాన్ని నేరుగా వైష్ణవిని ఓ పాత్రికేయుడు అడిగితే ..ఆమె కి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. దీంతో దర్శకుడుకి కూడా ఎలాంటి రియాక్ట్ అవ్వాలో అర్దం కాక..అలాంటివి అడగొద్దు అంటూ స్కిప్ కొట్టాడు. తాజాగా వైష్ణవి మరో ఇంటర్వ్యూలో ఈ బోల్డ్ సీన్స్ పై బేబి ఓపెన్ అయింది. 'రొమాన్స్.. లిప్‌లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ బేబీ టీమ్ నన్ను కంఫర్ట్‌గా చూసుకుంది.
ఆ సీన్ చేసే రోజు సెట్లో తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. బోల్డ్ సీన్స్ చేసే సమయంలో విరాజ్ అశ్విన్ కూడా సాయపడ్డాడు. సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో.. జస్ట్ మనం నటిస్తున్నామంతే అన్నాడు.
నేను అలాగే ఆలోచించాను. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారు. సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్‌లాక్ బోల్డ్ సీన్స్ గుర్తుండవు. అంతకు మించిన భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి' అని తెలిపింది.