Begin typing your search above and press return to search.

బలగం కుదర్లేదు మరి ఈసారైనా..?

బలగం సినిమా మిస్సైనా సరే బేబీ తో హిట్ అందుకున్న వైష్ణవికి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు వేణు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:51 AM GMT
బలగం కుదర్లేదు మరి ఈసారైనా..?
X

బలగం సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాక కానీ వేణు డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది అందరికీ అర్థం కాలేదు. జబర్దస్త్ లో స్కిట్ ని డైరెక్ట్ చేయడమే కాదు సినిమాను కూడా తాను బాగా హ్యాండిల్ చేయగలను అని ప్రూవ్ చేశాడు వేణు. ఇన్నాళ్లు అతన్ని ఒక కమెడియన్ గా చూసిన ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ పీపుల్ ఇప్పుడు అతన్ని ఒక ఫిల్మ్ మేకర్స్ గా చూసి సూపర్ అనేస్తున్నారు. బలగం ఇచ్చిన ప్రోత్సాహంతో డైరెక్షన్ మీదే తన పూర్తి ఫోకస్ పెడుతున్నాడు వేణు. బలగం తర్వాత తన సెకండ్ సినిమా కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేస్తారని తెలుస్తుంది.

బలగం తో హిట్ కొట్టిన వేణుకి ఈసారి మంచి బడ్జెట్ తోనే దిల్ రాజు సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్లాన్ భారీగానే ఉంటుందని తెలుస్తుంది. టైర్ 2 హీరో ఈ మూవీలో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

బలగం సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. అసలైతే ఆ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించాల్సి ఉంది. కానీ ఆ టైం లో ఆమె ఆల్రెడీ బేబీ సినిమాకు సైన్ చేయడం వల్ల బలగం వదుకోవాల్సి వచ్చింది.

బలగం సినిమా మిస్సైనా సరే బేబీ తో హిట్ అందుకున్న వైష్ణవికి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు వేణు. తెలుగు అమ్మాయిలను ముందు ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న వేణు ఇక్కడ హీరోయిన్స్ తోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో వేణు తన సెకండ్ సినిమాలో వైష్ణవిని దాదాపు ఫిక్స్ చేసినట్టే అంటున్నారు. ఇంతకీ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది.

బలగం లాంటి ఎమోషనల్ సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన వేణు. సెకండ్ సినిమా కమర్షియల్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. దసరాకి ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. దిల్ రాజు ఈసారి వేణు మీద భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. బలగం తో వేణు బేబీ తో వైష్ణవి ఈ కాంబో కలిస్తే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా హీరో గురించే త్వరలోనే ఒక ఫైనల్ డెసిషన్ కి వస్తారని తెలుస్తుంది.