Begin typing your search above and press return to search.

ఈరోజు కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశా : వైష్ణవి చైతన్య

అంత పెద్ద స్క్రీన్ పై నన్ను నేను చూసుకున్న తర్వాత ఇన్ని రోజులు ఎదురుచూసింది ఈరోజు కోసమే కదా అనిపించిందని అన్నారు వైష్ణవి చైతన్య.

By:  Tupaki Desk   |   18 July 2023 11:35 AM GMT
ఈరోజు కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశా : వైష్ణవి చైతన్య
X

బేబీ సినిమా లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఇదివరకు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సీరీస్ లలో నటించింది. ఆమె చేసిన ప్రయత్నాలన్నీ కలిసి బేబీ లో ఛాన్స్ వచ్చేలా చేశాయి. బేబీ సక్సెస్ లో వైష్ణవికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాల్సిందే. మొదటి సినిమా లోనే బాగా డెప్త్ ఉన్న పాత్ర చేసి ఆమె మెప్పించారు. ఇక బేబీ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో వైష్ణవి స్పీచ్ కూడా అందరిని సర్ ప్రైజ్ చేసింది.

బేబీ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బేబీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు వచ్చిన అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసు, మారుతి, నాగబాబు గారికి థాంక్స్. ఈ సినిమాతో నన్ను నేను ఈ కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పుకుంటున్నా.. తెలుగు అమ్మాయి అద్భుతంగా నటించిందని అందరు అంటుంటే మస్త్ ఖుషీ గా ఉంది. తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావనే ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. అలాంటి మాటలు విని ప్రయత్నం చేయూకుండా చాలామంది అమ్మాయిలు ఆగిపోతున్నారని వైష్ణవి చైతన్య అన్నారు.

ఇక్కడ రాణించాలంటే ప్రతీ ఒక్కరు ట్రై చేయాలి. నాకు సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ దొరికినట్టు ఎవరైతే ట్రై చేస్తారో వారికి ఇలాంటి వాళ్లు దొరుకుతారు. మాలాంటి కొత్త ఫేస్ లకు ఇన్ని పైసలు ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాకు రియల్ హీరోలు విజయ్ బుల్గానిన్, బాల్ రెడ్డి, సురేష్, కళ్యాణ్ చక్రవర్తి, అనంత్ శ్రీరామ్ లే.. ఈ హిట్ వెనుక వారంతా ఉన్నారు. వాళ్లందరికీ థాంక్స్ అని చెప్పారు వైష్ణవి.

ఈ సినిమా చూసొచ్చిన మారుతి గారు, బన్నీ వాసు గారు చెబుతుంటే నమ్మలేకపోయాం.. ఫస్ట్ డే థియేటర్ లో రెస్పాన్స్ చూస్తే వేరే ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. అంత పెద్ద స్క్రీన్ పై నన్ను నేను చూసుకున్న తర్వాత ఇన్ని రోజులు ఎదురుచూసింది ఈరోజు కోసమే కదా అనిపించిందని అన్నారు వైష్ణవి చైతన్య.

జూలై 14 నా జీవితం లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ ఈవెంట్ కు మమ్మీ డాడీ వచ్చారు. చిన్నప్పటి నుంచి నేను ఏది చేఇనా వారు సపోర్ట్ గా ఉన్నారు. వారు సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని అన్నారు వైష్ణవి. ఈరోజు గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ లో మీరు ఇంకా ఆనందంగా ఉండే రోజులు వస్తున్నాయి.. మిమ్మల్ని ఇంకా సంతోషంగా ఉంచేలా ప్రయత్నిస్తానని వైష్ణవి అన్నారు.