బేబీ రెమ్యునరేషన్.. అప్పుడే అంత అడిగేస్తుందా?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ కోసం వైష్ణవి చైతన్యని ఫైనల్ చేసారంట.
By: Tupaki Desk | 9 Aug 2023 4:07 AM GMTతెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవడమే గగనం. ఏవో కొన్ని సినిమాలలో ఛాన్స్ లు వచ్చిన అవన్నీ కూడా లోబడ్జెట్ మూవీస్ అయ్యి ఉంటాయి. వారిని వారు స్టార్ గా రిప్రజెంట్ చేసుకునే అవకాశాలు మాత్రం రావు. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వకపోవడానికి దర్శకులు చెప్పే కారణాలు చాలా ఉంటాయి. అయితే తాజాగా బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఒక్కసారిగా స్టార్ అయిపొయింది.
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో కనిపించింది. అదే సమయంలో బేబీ దర్శకుడి దృష్టిలో పడటంతో అనూహ్యంగా టైటిల్ రోల్ కి కన్ఫర్మ్ అయ్యింది. సినిమాలో కొన్ని బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాలకి ఆమె ఒకే చెప్పడంతో స్టార్ తిరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు బేబీ సినిమా టాలీవుడ్ లో ట్రేడ్ సెట్టర్. వైష్ణవి చైతన్యకి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది.
నిర్మాతలు కూడా వైష్ణవిని హీరోయిన్ గా తీసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఊహించని విధంగా తన ఫేవరేట్ హీరో రామ్ పోతినేనికి జోడీగా నటించే ఛాన్స్ ని రెండో సినిమాతోనే కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ కోసం వైష్ణవి చైతన్యని ఫైనల్ చేసారంట.
ఇక ఈ మూవీకోసం వైష్ణవికి కోటి రూపాయిల రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ పూరి టీం ఇస్తున్నట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ కి భారీగా ఇచ్చుకునేబదులు లోకల్ టాలెంట్ ని యూజ్ చేసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా బెస్ట్ వస్తుందని భావించి పూరి జగన్నాథ్ వైష్ణవిని డబుల్ ఇస్మార్ట్ కోసం కన్ఫర్మ్ చేసారంట.
దీంతో రెండో సినిమాకే కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకునే తెలుగు హీరోయిన్ గా వైష్ణవి చైతన్య రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దీంతో పాటు తమిళంలో కూడా బేబీ సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నారంట. అక్కడ కూడా వైష్ణవిని లీడ్ రోల్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోందని పూరి టీం నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట.