Begin typing your search above and press return to search.

పదహారణాల అందంతో మాయ చేస్తోన్న వైష్ణవి

టాలీవుడ్ కి చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా వచ్చిన చాలా కాలం తర్వాత వైష్ణవి చైతన్యకి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు లభించింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 11:05 AM GMT
పదహారణాల అందంతో మాయ చేస్తోన్న వైష్ణవి
X

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసి బేబీ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన అందాల భామ వైష్ణవి చైతన్య. ఈ అమ్మడుని ఆ ఒక్క సినిమా రాత్రికి రాత్రి స్టార్ ని చేసేసింది. టాలీవుడ్ దర్శక, నిర్మాతల అందరి దృష్టిని తన అందం, నటనతో ఆకర్షించింది. తెలంగాణ అమ్మాయి అయిన వైష్ణవికి ఈ స్థాయిలో క్రేజ్ రావడం నిజంగా విశేషమని చెప్పాలి.


టాలీవుడ్ కి చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా వచ్చిన చాలా కాలం తర్వాత వైష్ణవి చైతన్యకి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు లభించింది. ఈమె కచ్చితంగా నెక్స్ట్ జెనరేషన్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎదుగుతుందని అందరూ భావిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ వైష్ణవితో ఇప్పటికే సినిమాలు చేయడం కోసం అడ్వాన్స్ లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా బేబీ సినిమాతో అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ నిర్మాణంలోనే వైష్ణవి హీరోయిన్ గా సెకండ్ మూవీ స్టార్ట్ అయ్యింది. బేబీ సినిమాలో జతకట్టిన ఆనంద్ దేవరకొండతోనే రెండో మూవీ కూడా చేస్తూ ఉండటం విశేషం. మొత్తం టీమ్ అంతా బేబీకి వర్క్ చేసిన వారే. ఈ సినిమా పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసి సినిమాని ఎనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో తెలంగాణలో స్టార్ ఐకాన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో వైష్ణవి చైతన్య అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. బతుకమ్మ సంబరాలు, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైష్ణవి ఇంటరెస్టింగ్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.

వైట్ శారీలో బంతుపూల బతుకమ్మని నీళ్ళలో విడిచి పెడుతూ ఉన్న వైష్ణవి ఫోటో చూస్తుంటే పదహారణాల అందం పలకరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ ఫోటోని ఏకంగా 1.73 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఇక ఫ్యాన్స్ కూడా లవ్, హార్ట్ సింబల్స్ తో ఆమె అందాన్ని పొగిడేస్తూ ఉన్నారు. ఈ ఫోటోతో పాటుగా ఫ్యాన్స్ అందరికి దసరా, బతుకమ్మ పండగ శుభాకాంక్షలు వైష్ణవి తెలియజేసింది.