Begin typing your search above and press return to search.

ఆదికేశవ్ ఏం చేస్తాడో..?

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే, ఉప్పెన తర్వాత మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు.

By:  Tupaki Desk   |   30 July 2023 2:30 PM GMT
ఆదికేశవ్ ఏం చేస్తాడో..?
X

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే, ఉప్పెన తర్వాత మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు. కొండపాలెం, రంగ రంగ వైభవంగా సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఈ రెండు సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో, చాలా ఆశలు పెట్టుకొని, ఎలాగైనా హిట్ కొట్టాలని ఆదికేశవ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. నిజానికి ఈ మూవీని ఆగస్టు18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు వాయిదా వేయడమే బెటర్ అని చిత్ర బృందం భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. పెద్ద సినిమాలు కూడా అదే వారంలో విడుదలౌతుండటంతో, తేదీ మారే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

ఎంత మంచి సినిమా తీశాం అనేదానికంటే, దానిని ఏ సమయంలో విడుదల చేశాం అనేది కూడా అంతే ముఖ్యం. తెలివిగా విడుదల చేయకంటే, దెబ్బపడే అవకాశం ఉంది. అసలే చిరంజీవి భోళా శంకర్ కూడా కొంచెం అటూ, ఇటుగా అప్పుడే విడుదల అవుతోంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, ఆ సినిమాకి అందరూ క్యూ కట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, రజినీకాంత్ జైలర్, అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి కూడా అటు ఇటుగా అప్పుడే విడుదల అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ మూవీ విడుదల చేస్తే, లాభం కన్నా, ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అందుకే, వాయిదా వేయడమే బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇప్పటి వరకు మూవీ ప్రమోషన్స్ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఇలాంటి సమయంలో విడుదల చేయకపోవడమే మంచిదని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీలో తొలిసారి వైష్ణవ్ ఫుల్ యాక్షన్ మూవీలో నటించినట్లు తెలుస్తోంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అపర్ణా దాస్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో శ్రీలలతో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది.