Begin typing your search above and press return to search.

ఆ మెగా హీరో అలా ట్రై చేయాల్సిందే..!

ఉప్పెన తర్వాత వరుస 3 సినిమాలు మెగా మేనల్లుడికి నిరాశ మిగిల్చింది. సినిమాలు సక్సెస్ అయితే ఎంత పాజిటివ్ గా వార్తలు వస్తాయో ఫ్లాప్ అయితే అదే రేంజ్ లో నెగిటివిటీ వస్తుంది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 9:30 AM GMT
ఆ మెగా హీరో అలా ట్రై చేయాల్సిందే..!
X

మొదటి సినిమా హిట్ పడితే ఆ హీరో రేంజ్ వేరేలా ఉంటుంది. అదీగాక సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో చేసిన మొదటి సినిమా హిట్ పడితే ఆ క్రేజ్ తెలిసిందే. ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేసి వావ్ అనిపించాడు. డైరెక్టర్ బుచ్చి బాబు డైరెక్షన్, కథ, కథనాలు అన్నీ ఆ సినిమాకు కలిసి వచ్చాయి. మొదటి సినిమా హిట్ పడితే ఆ క్రేజ్ ఎలా ఉన్నా అది కొనసాగించాల్సిన బాధ్యత మాత్రం ఎక్కువగా ఉంటుంది.


ఉప్పెన తర్వాత వెంటనే క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం సినిమా చేశాడు వైష్ణవ్ తేజ్. నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ద్వితీయ విఘ్నం దాటలేకపోయిన వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీగా రంగ రంగ వైభవంగా సినిమా చేశాడు. ఆ సినిమా కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక నాలుగవ ప్రయత్నంగా ఆదికేశవ సినిమా చేశాడు మెగా హీరో. అది కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది.

ఉప్పెన తర్వాత వరుస 3 సినిమాలు మెగా మేనల్లుడికి నిరాశ మిగిల్చింది. సినిమాలు సక్సెస్ అయితే ఎంత పాజిటివ్ గా వార్తలు వస్తాయో ఫ్లాప్ అయితే అదే రేంజ్ లో నెగిటివిటీ వస్తుంది. వైష్ణవ్ తేజ్ వరుస 3 ఫ్లాపులు ఆ హీరో ని డైలమాలో పడేసింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసేందుకు చాలా మంది హీరోలు ఉన్నారు. అలా కాకుండా డిఫరెంట్ కథలతో కొత్త ప్రయత్నాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. వైష్ణవ్ తేజ్ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తే బెటర్ అని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కొత్త కథ.. డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా సరే ఆదరిస్తారు. రీసెంట్ గా సంక్రాంతి ఫైట్ లో నిలిచిన హనుమాన్ కూడా మరోసారి అది ప్రూవ్ చేసింది. కంటెంట్ లో విషయం ఉంటే అందులో స్టార్స్ ఎవరు అవసరం లేదని ప్రూవ్ చేసింది. సో వైష్ణవ్ తేజ్ తన పంథా మార్చి కొత్త కథలతో సినిమాలు చేస్తే తనకు వచ్చిన ఈ మెగా ఫాలోయింగ్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మెగా హీరోల్లో కెరీర్ పరంగా వెనుకబడిన చాలామంది హీరోలు కూడా కొత్తగా ట్రై చేసి ఫ్యాన్స్ ని మెప్పించాలి కానీ రొటీన్ పంథాలో సినిమాలు చేస్తామంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని మెగా హీరోలు గమనించి సినిమాలు చేస్తే బెటర్.