మాజీ ప్రధాని వాజ్‌పేయి 99వ జయంతి స్పెషల్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితకథతో రూపొందుతున్న చిత్రం `మై అటల్ హూన్`. పంకజ్ త్రిపాఠి వాజ్ పేయి పాత్రలో నటిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2023 4:01 AM GMTమాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితకథతో రూపొందుతున్న చిత్రం `మై అటల్ హూన్`. పంకజ్ త్రిపాఠి వాజ్ పేయి పాత్రలో నటిస్తున్నారు. వాజ్ పేయి బాల్యం, నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానిగా.. విభిన్న రూపాలను ఈ సినిమాలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. వాజ్ పేయి 99వ జయంతిని పురస్కరించుకుని `మై అటల్ హూన్` నిర్మాతలు `దేశ్ ఫేలే` అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పంకజ్ త్రిపాఠి ఈ ప్రత్యేక సందర్భంలో మొదటి పాటతో అభిమానులను అలరించారు. చరిత్రను తిరగరాసిన కవి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రపంచంలోకి తీసుకెళ్లే పాట ఇది. జుబిన్ నౌటియాల్ పాడారు. హృదయాన్ని హత్తుకునే సాహిత్యాన్ని మనోజ్ ముంతాషిర్ రాశారు. పాయల్ దేవ్ స్వరపరిచారు.
వాజ్ పేయి తన కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) లో చేరిన తన కాలేజీ రోజుల నుండి ఒక ఫన్నీ సంఘటనను కూడా పంకజ్ త్రిపాఠి ఇంతకుముందు మీడియా ఇంటరాక్షన్ లో గుర్తు చేసుకున్నాడు. వాజ్ పేయి రాజకీయ ఆసక్తి గురించి ముచ్చటించారు. వాజ్ పేయి జైలు జీవితం గురించి పంకజ్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ``నేను యూత్‌వింగ్‌లో ఉన్నాను.. ఆందోళనల్లో పాల్గొన్నాను.. వారం రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారు! తో మెయిన్ ఉస్ రాస్తే పీ నికల్ చుక థా.. రాజకీయాల బాట ముళ్లతో కూడుకున్నదని గ్రహించాను.. అందుకే మలుపు తీసుకున్నాను. వీధి థియేటర్‌పై ఆసక్తిని పెంచుకోవడం ప్రారంభించాను. పాట్నాలోని కైల్‌దాస్ రంగాలయలో నేను నా పేరు నమోదు చేసుకున్నాను. ముఝే లగా కీ యే బెహతర్ హై. యహాన్ కమ్ సే కమ్ బోల్ కే యాక్టింగ్ హోతీ హై కి `మెయిన్ యాక్టింగ్ కర్ రహా హూన్``` అని పంకజ్ చమత్కరించారు. రవి జాదవ్ దర్శకత్వం వహించిన మైన్ అటల్ హూన్ చిత్రం 19 జనవరి 2024న విడుదల కానుంది.
అటల్ బిహారీ వాజ్‌పేయి కథను వెండితెరపైకి తీసుకురావడం తనకు గర్వకారణమని పంకజ్ అన్నారు.
'సినిమాని మించి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో ఎన్నో కోణాలను తెరపై చూపిస్తున్నామ``ని పంకజ్ అన్నారు. 'ఆయన నిజంగా ఒక లెజెండ్. అతడి స్ఫూర్తిదాయకమైన కథను ప్రపంచానికి అందించడం మాకు గౌరవం. ప్రేక్షకులు మా ప్రయత్నాలను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అటల్ జీ వారసత్వం పెద్ద తెరపైకి వస్తుంది`` అని అన్నారు. ఈ చిత్రాన్ని భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ - లెజెండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినోద్ భానుషాలి, సందీప్ సింగ్, సామ్ ఖాన్, కమలేష్ భానుశాలి ఈ చిత్రానికి నిర్మాతలు.