Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ - టాలీవుడ్ డైరెక్టర్.. సెట్టయినట్లేనా?

అందుకే దిల్ రాజుకు వంశీ పైడిపల్లి స్టోరీ నెరేట్ చేయగా.. అమీర్ ఖాన్ అయితే ఆ రోల్ కు సెట్ అవుతారని చెప్పారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Dec 2024 8:30 AM GMT
అమీర్ ఖాన్ - టాలీవుడ్ డైరెక్టర్.. సెట్టయినట్లేనా?
X

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టులో రిలీజ్ అయిన ఆ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. బాక్సాఫీస్ వద్ద సినిమా నిరాశపరిచింది. మూవీ డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు అమీర్ ఖాన్.

ఇప్పుడు మళ్లీ తనను తాను రీలాంఛ్ చేసుకునేందుకు అమీర్ ఖాన్ సిద్ధమవుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. సాలిడ్ సబ్జెక్ట్ తో వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రాసుకున్నారని.. అమీర్ ఖాన్ కు సరిగ్గా సూట్ అవుతుందని సమాచారం.

అందుకే దిల్ రాజుకు వంశీ పైడిపల్లి స్టోరీ నెరేట్ చేయగా.. అమీర్ ఖాన్ అయితే ఆ రోల్ కు సెట్ అవుతారని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అమీర్ ఖాన్ ను ఒప్పించే పనిలో వంశీ, దిల్ రాజు ఉన్నట్లు సమాచారం. అయితే క్రేజీ కాంబోపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

దీంతో మరో తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టినట్లే! అయితే ఇప్పటి వరకు వంశీ పైడిపల్లి ఆరు సినిమాలు తీసిన విషయం తెలిసిందే. వాటిలో ఐదు మూవీలను దిల్ రాజే నిర్మించారు. ఇప్పుడు అమీర్ ఖాన్- వంశీ పైడిపల్లి ప్రాజెక్టును కూడా ఆయనే నిర్మించనున్నారని తెలుస్తోంది. బ్యాక్ గ్రాండ్ లో వర్క్ కూడా జరుగుతోందట.

చివరగా కోలీవుడ్ నటుడు విజయ్ దళపతితో వారసుడు సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఆ సినిమా మిక్స్ డ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలతో మూవీ తీయాలని వంశీ అనుకున్నారట. కానీ ఆయనకు సరైన ఛాన్సులు లభించలేదనే చెప్పాలి.

ఆ తర్వాత తాను రాసుకున్న కథతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో వంశీ సినిమా చేస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ తో మూవీ చేయనున్నారు! అలా బాలీవుడ్ నటులంతా సౌత్ డైరెక్టర్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ దర్శకులతో పని చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా తెలుగు సినిమాతో సందడి చేయనున్నారన్నమాట!