సూర్య అచలుడు.. ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ..!
సూర్య బాలా కాంబోలో రాబోతున్న వనంగాన్ సినిమా ఆగిపోయింది.
By: Tupaki Desk | 30 Dec 2024 7:36 AM GMTకోలీవుడ్ స్టార్ సూర్య ఈ మధ్యనే కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా ప్రస్తుతం సూర్య సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. సూర్య బాలా కాంబోలో రాబోతున్న వనంగాన్ సినిమా ఆగిపోయింది. కోలీవుడ్ లో బాలా సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన రియలిస్ట్ సినిమాలతో ఎంతోమంది స్టార్స్ కి సూపర్ హిట్ ఇచ్చాడు. ఐతే ఈమధ్య ఆయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులకు ఎక్కట్లేదు.
అయినా సరే సూర్య తన కెరీర్ లో శివపుత్రుడు లాంటి సినిమా ఇచ్చాడని ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. సూర్య, బలా కాంబినేషన్ లో వనంగాన్ సినిమా అనౌన్స్ చేశారు. సురేష్ కామాచి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్రయత్నించారు. ఆల్రెడీ సినిమా ప్రకటించడం సెట్స్ మీదకు వెళ్లడం కూడా జరిగింది. ఐతే ఈ సినిమా రియల్ లొకేషన్స్ లో తీస్తుండటం వల్ల అక్కడికి జనాలు ఎక్కువ అవ్వడం తో షూటింగ్ కు ఇబ్బంది అవుతుందట. ఐతే కొన్నాళ్లు షూటింగ్ ఆపేసిన బాలా అండ్ టీం ఇప్పుడు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ అయినట్టు ప్రకటించారు.
ఐతే సూర్య ఈ సినిమా లేట్ అవుతుందని శివ డైరెక్షన్ లో కంగువ చేశాడు. ఇక ఫైనల్ గా బాలా సినిమాను పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. వనంగాన్ సినిమా క్యాన్సిల్ అయినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రీ లుక్ పోస్టర్స్ కూడా వదిలారు. ఒక పరదా (గోతం) వెనక సూర్య ఇంటెన్స్ లుక్ అదిరిపోగా ఫ్యాన్స్ కి ఈసారి వీరి కాంబో ఒక మాస్ ఫీస్ట్ అందిస్తుందని అనుకున్నారు.
కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగులో అచలుడు అనే టైటిల్ పెట్టారు. ఐతే టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన బాలా సినిమా విషయంలో వెనక్కి తగ్గడం ఆయన సినీ లవర్స్ కి షాక్ ఇస్తుంది. ఐతే సూర్య కంగువ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆర్.జె బాలాజీ డైరెక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు. బాలా దాదాపు ట్రాక్ తప్పగా ఆయన డైరెక్షన్ లో సినిమా అనగానే సూర్య ఫ్యాన్స్ అప్సెట్ అవ్వగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో హీరో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.