Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఆ ఒక్క ప్రాజెక్టు కోసం ఇలా..

విమర్శలు ఎదురైన తన స్టైల్ ఆఫ్ మేకింగ్ లో మార్పులు చేసుకోవడానికి సందీప్ రెడ్డి వంగా సిద్ధంగా లేరు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 5:43 AM GMT
ప్రభాస్.. ఆ ఒక్క ప్రాజెక్టు కోసం ఇలా..
X

రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఇండియాలో ఇప్పుడు ఎక్కువమంది చర్చించుకుంటున్న పేరు సందీప్ రెడ్డి వంగా. హై ఎమోషన్స్ ఉండే వ్యక్తిని హీరోగా రిప్రజెంట్ చేస్తూ ‘అర్జున్ రెడ్డి’తో ప్రేమకథని చెప్పి సందీప్ రెడ్డి సూపర్ సక్సెస్ అందుకున్నారు. నెక్స్ట్ ‘యానిమల్’ తో మోస్ట్ వైలెంట్ ఆటిట్యూడ్ ఉన్న హీరోగా రణబీర్ కపూర్ ని చూపించి దేశ వ్యాప్తంగా తన గురించి చర్చించుకునేలా చేశాడు. ‘యానిమల్’ మూవీకి పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో క్రిటిక్స్, మేధావుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

విమర్శలు ఎదురైన తన స్టైల్ ఆఫ్ మేకింగ్ లో మార్పులు చేసుకోవడానికి సందీప్ రెడ్డి వంగా సిద్ధంగా లేరు. ఇప్పుడు ‘స్పిరిట్’ తో నెక్స్ట్ లెవల్ వైలెన్స్ ని తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తుందంటే దానికి సందీప్ రెడ్డి మేకింగ్ స్టైల్ కారణం అని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ‘స్పిరిట్’ మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

సందీప్ రెడ్డి లాంటి హై విజనరీ ఉన్న డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉన్న స్టార్ దొరికితే అద్భుతం చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అందుకే సినీ అభిమానులు స్పిరిట్ గురించి ఏ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయిన చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘స్పిరిట్’ మూవీకి సంబందించిన ఓ ఇంటెరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్రభాస్ పూర్తిగా ఈ చిత్రం పైనే ఫోకస్ చేయనున్నాడంట.

‘స్పిరిట్’ తో పాటు మరో ప్రాజెక్ట్ ని ఒకేసారి చేసే అవకాశం లేదనే ప్రచారం నడుస్తోంది. రెండు పడవల ప్రయాణం కాకుండా పూర్తిగా ‘స్పిరిట్’ సినిమాకి ప్రభాస్ డేట్స్ కేటాయించబోతున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవల్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఆవిష్కరించాలనే టార్గెట్ తో ఉన్నాడని బిటౌన్ లో టాక్. దానికోసమే సినిమా బడ్జెట్ కూడా ముందు అనుకున్న దానికంటే భారీగా పెంచారని అంటున్నారు.

‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా, డార్లింగ్ ప్రభాస్ ఇండియాని షేక్ చేయడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో క్యారెక్టర్ తో పాటు మోస్ట్ వైలెంట్ విలన్ గా కూడా కనిపించబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. హీరో, విలన్ క్యారెక్టర్స్ మధ్యలో నడిచే వార్ ని నెవ్వర్ బిఫోర్ అనేలా సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. మరి ‘యానిమల్’ తోనే దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తో హాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తాడో లేదో చూడాలి.