'స్పిరిట్' స్క్రిప్టు రెడీ అనేసిన వంగా
యానిమల్ సంచలన విజయం సాధించడంతో సందీప్ వంగా తదుపరి ప్రకటన కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా అది సంచలనంగా మారుతుందనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 4 Jan 2024 4:02 AM GMTయానిమల్ సంచలన విజయం సాధించడంతో సందీప్ వంగా తదుపరి ప్రకటన కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా అది సంచలనంగా మారుతుందనడంలో సందేహం లేదు. తదుపరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అతడు స్పిరిట్ తెరకెక్కించాల్సి ఉండగా, ప్రస్తుతం అతడు ఆ పనిలోనే ఉన్నాడు. సైమల్టేనియస్ గా తన సినిమా యానిమల్ ని ప్రమోట్ చేసుకుంటూనే, స్పిరిట్ స్క్రిప్టును పూర్తి చేసానని తాజాగా హింట్ ఇచ్చాడు.
నిజానికి రెండు మూడు నెలల క్రితం స్పిరిట్ స్క్రిప్టుపై సందీప్ వంగాకు క్లారిటీ లేదు. అప్పటికి పూర్తి స్క్రిప్టు లేదు. కానీ ఇప్పుడు అతడు పూర్తి క్లారిటీతో ఉన్నామని అన్నాడు. కొన్ని యాక్షన్ బ్లాక్ లు మినహా స్పిరిట్ స్క్రిప్టును ఇప్పటికే పూర్తి చేసానని సందీప్ వంగా అంటున్నారు. బౌండ్ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ ని అతడు రెడీ చేయాల్సి ఉంది.
చిరంజీవి- షారూఖ్‌లతోను..!
యానిమల్ తర్వాత సందీప్ వంగా తదుపరి ప్రభాస్ -అల్లు అర్జున్‌లతో కలిసి పని చేయనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి - షారూఖ్ ఖాన్‌లతో కలిసి పనిచేయాలని ఉందని సందీప్ వంగ తన కోరికను వ్యక్తం చేశాడు. ఆ ఇరువురూ తనకు ఆరాధ్యదైవాలు అని, ఆ సమయం ఎప్పుడొస్తుందో తనకు తెలియదని అన్నాడు. సందీప్ వంగా ఇద్దరు సూపర్‌స్టార్‌లతోను నిరూపించే అద్భుతమైన స్క్రిప్ట్ కోసం ఆసక్తిని కలిగి ఉన్నాడు. మంచి స్క్రిప్టు, పాత్రలు కుదిరితే.. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నానని, నెల రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు.
తాను కథలు స్వతంత్రంగా రాస్తానని, సమూహం(రచయితల)తో కలిసి పని చేయనని సందీప్ వంగా తెలిపాడు. అతడు సోలోగా పని చేస్తాడు. స్క్రిప్ట్ లేదా కథను ఎవరితోనైనా షేర్ చేస్తూ వెళ్లాలంటే దానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే మూడు చిత్రాల నుండి పొందిన అనుభవంతో స్టోరి ప్రక్రియను వేగవంతం చేసి భవిష్యత్తులో మరింత వేగంగా సినిమాల కోసం పని చేయవచ్చని అంగీకరించాడు.
ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించే 'స్పిరిట్' ప్రీ-ప్రొడక్షన్ కోసం సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2024 మధ్య సంవత్సరం నాటికి చిత్రీకరణను ప్రారంభించి 2025లో విడుదల చేస్తారు. తదుపరి యానిమల్ సీక్వెల్ 'యానిమల్ పార్క్`ని వెంటనే తెరకెక్కిస్తాడు.