Begin typing your search above and press return to search.

నాలుగో పెళ్లికి రెడీ అయిన వ‌నితా విజ‌య్ కుమార్?

కోలీవుడ్ న‌టి వ‌నితా విజ‌య్ కుమార్ గురించి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె ఇప్పుడు ఓ సినిమాతో చాలా బిజీగా ఉంది

By:  Tupaki Desk   |   13 Feb 2025 8:36 AM GMT
నాలుగో పెళ్లికి రెడీ అయిన వ‌నితా విజ‌య్ కుమార్?
X

కోలీవుడ్ న‌టి వ‌నితా విజ‌య్ కుమార్ గురించి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె ఇప్పుడు ఓ సినిమాతో చాలా బిజీగా ఉంది. వ‌నితా మొన్నా మ‌ధ్య తెలుగులో వ‌చ్చిన మ‌ళ్లీ పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఇదిలా ఉంటే వ‌నిత సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

గ‌తేడాది అక్టోబ‌ర్ నుంచే వ‌నితా విజ‌య్ కుమార్, కొరియోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్త‌లొస్తున్నాయి. బీచ్ లో వ‌నితా, రాబర్ట్ కు ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్టు వ‌చ్చిన ఫోటోను చూసి అంద‌రూ ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింద‌ని అనుకున్నారు. కానీ ఆ త‌ర్వాత అది సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చేసిన పోస్ట‌ర్ అని తెలిసి సైలెంట్ అయ్యారు.

ఇదిలా ఉంటే మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ‌నిత తాజాగా మ‌రో పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. పెళ్లి చేసుకోవాల‌నే ఆశ‌తో ప్రేమ‌లో పడ్డాం. ఎప్ప‌టికీ క‌లిసి జీవించాల‌నే ఆశ‌తోనే పెళ్లి చేసుకున్నాం.. అస‌లు అరుణ్, విద్య ప్ర‌పంచంలో ఏం జ‌రిగిందంటూ ఓ ల‌వ్ కొటేష‌న్ ను రాస్తూ సినిమా పోస్ట‌ర్ ను షేర్ చేసింది. వ‌నిత ఆ పోస్ట‌ర్ ను షేర్ చేసిన కాసేప‌టికే అది నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఈ పోస్ట‌ర్ ను చూసిన నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు. వ‌నిత మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అని కొంద‌రు అంటుంటే, కాదు అదంతా సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అని మ‌రికొంద‌రంటున్నారు. మొత్తానికి ఆ పోస్ట్ దేనికి సంబంధించిన‌దైనా స‌రే వ‌నితా విజ‌య్ కుమార్ మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది.

అయితే తాజాగా వ‌నిత త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆ ఫోటోలో ఆమె పెళ్లి కూతురు గెట‌ప్ లో ఉంటే రాబ‌ర్ట్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో ఉన్నాడు. అది చూసే వ‌నిత నాలుగో పెళ్లికి రెడీ అయిందా అని అంద‌రూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె గ‌తంలో ఆకాష్, రాజ‌న్ ఆనంద్, పీట‌ర్ పాల్ తో పెళ్లి చేసుకుని వారి నుంచి విడిపోయింది. గ‌తంలో వ‌నిత మూడు పెళ్లిళ్లు చేసుకున్నందునే ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిందేమోన‌నే అనుమానాలొస్తున్నాయి. ఏదేమైనా సినిమా కంటే కూడా ఆమె పెళ్లి మీదే ఇప్పుడు అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంది.