Begin typing your search above and press return to search.

రమ్యకృష్ణతో గొడవ.. అసలు విషయం బయటపెట్టిన నటి..!

ఆ తర్వాత డైవర్స్ మళ్లీ రెండో పెళ్లి.. అది కూడా కాదని బయటకు రావడం మళ్లీ మూడో పెళ్లి చేసుకోవడం.. ఇలా పెళ్లిల్లతోనే ఆమె ఎక్కువ వార్తల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   12 July 2024 1:30 AM GMT
రమ్యకృష్ణతో గొడవ.. అసలు విషయం బయటపెట్టిన నటి..!
X

వనిత విజయ్ కుమార్ ఎక్కడ ఉంటుందో అక్కడ సాధ్యమైనంతవరకు వివాదాలు ఉంటాయి. సౌత్ యాక్టర్ విజయ్ కుమార్ తనయురాలిగా టీనేజ్ లోనే హీరోయిన్ గా అడుగు పెట్టిన వనిత ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఐతే హీరోయిన్ గా ఆమె క్లిక్ అవ్వలేదు. కాస్త కెరీర్ బాగుంది అనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంది. దాని వల్ల సినిమా ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత డైవర్స్ మళ్లీ రెండో పెళ్లి.. అది కూడా కాదని బయటకు రావడం మళ్లీ మూడో పెళ్లి చేసుకోవడం.. ఇలా పెళ్లిల్లతోనే ఆమె ఎక్కువ వార్తల్లో నిలిచారు.

వనిత గురించి తెలిసిన వారెవరైనా సరే ఆమె జోలికి వెళ్లాలని అనుకోరు. ఐతే ఒక రియాలిటీ షోలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కు వనిత విజయ్ కుమార్ కి మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో వనిత విజయ్ కుమార్ ఒక యాక్ట్ చేయగా అందులో ఆమె అమ్మవారి వేషధారణ చేశారు. ఆ ఎపిసోడ్ కి జడ్జిగా వచ్చిన రమ్యకృష్ణ వనిత యాక్ట్ పట్ల కాస్త నెగిటివ్ కామెంట్స్ ఇచ్చింది. అంతేకాదు వనితని వేరే వాళ్లతో పోల్చుతూ మాట్లాడింది. ఈమె చేస్తున్న వ్యవహారాల వల్ల ఫ్యామిలీ కూడా వనిత విజయ్ కుమార్ ని దూరం పెట్టింది.

ఐతే దాన్ని సహించలేని వనిత రమ్యకృష్ణ జడ్జిమెంట్ కి హర్ట్ అయ్యి షో నుంచి వెళ్లిపోయారు. ఐతే ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ ఆ ఇన్సిడెంట్ గురించి చెబుతూ రమ్యకృష్ణ గారితో తన చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని ఆమె గొప్ప నటి.. కాకపోతే ఆ రోజు షో లో తనని వేరే వాళ్లతో పోల్చుతూ మాట్లాడటం వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు వనిత విజయ్ కుమార్.

నటిగా ఎప్పుడు రమ్యకృష్ణ అంటే తనకు ఇష్టమని.. కేవలం ఆ సందర్భంలో ఆమె మాటలు తనను హర్ట్ చేశాయని అన్నారు వనిత విజయ్ కుమార్. ఐతే ఆ తర్వాత ఆమెను కలిసే సందర్భం రాలేదని. ఆ విషయం గురించి తాను అప్పుడే వదిలేశానని చెప్పుకొచ్చారు వనిత విజయ్ కుమార్. ఇలా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత ఇలా చెప్పడం వనిత విజయ్ కుమార్ కి అలవాటే అని ఆడియన్స్ కూడా అర్థం చేసుకున్నారు. ఇలానే వనిత విజయ్ కుమార్ కొన్ని షోస్ కి జడ్జిగా వెళ్లి కూడా అక్కడ కూడా తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు.