Begin typing your search above and press return to search.

గాయంతో ఆస్ప‌త్రిలో ఉన్నా వ‌ర‌ద సాయం కోరిన హీరో

ఇప్పుడు ఈ వ‌ర‌ద‌ల‌కు సాయంపై అభిమానులకు నటుడు సూర్య సలహా ఇచ్చారు! చెన్నై వరద సాయంపై ఈ ప్ర‌క‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:41 PM GMT
గాయంతో ఆస్ప‌త్రిలో ఉన్నా వ‌ర‌ద సాయం కోరిన హీరో
X

చెన్నై వరదల్లో మున‌క‌లు వేసింది. సాయం కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో స్టార్లు విధిగా బాధ్య‌త‌గా స్పందిస్తూ చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ‌ర‌ద‌ల‌కు సాయంపై అభిమానులకు నటుడు సూర్య సలహా ఇచ్చారు! చెన్నై వరద సాయంపై ఈ ప్ర‌క‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సూర్య ఇటీవ‌ల కంగువా సెట్స్ లో తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. కంగువ‌ ఫైట్ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరించే క్ర‌మంలో అనూహ్యంగా రోప్ కెమెరా కిందపడిపోవడంతో నటుడు సూర్య ప్రాణాలతో బయటపడ్డాడని, ప్రమాదంలో గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే సూర్యను ఆసుపత్రికి తరలించగా, రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. సూర్య యాక్సిడెంట్ వార్త బయటకు వచ్చినప్పుడు అతడు తన ఎక్స్ సైట్‌లో `నేను బాగున్నాను` అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఈ స్థితిలో మిక్జామ్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం జలమయమైంది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాలు కూడా దెబ్బతిన్నాయి. అందులో కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపునకు గురవుతున్నాయి. అయితే చాలా చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడుతున్నారు. అలాగే బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అదేవిధంగా చిన్న తెర నటీనటులు, పెద్ద నటుల అభిమానులు అక్కడ అవ‌స‌ర‌మైన‌ సాయం చేస్తున్నారు. హీరో సూర్య కూడా అభిమానుల సంఘం తరపున బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నడుము లోతు నీటిలోకి దిగి సహాయం చేస్తున్నారు. వారి పాదాలు ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉన్నా కానీ వారు మురుగుతో కలిసిన వరద నీటిలో నిలబడి సాయం కొనసాగిస్తున్నారని నటుడు సూర్య తెలిపారు.

సూర్య వ్యాఖ్య‌లు అభిమానుల్లో మ‌రింత ఉత్సాహం నింపాయి. వారంతా బాధ్య‌త‌గా మ‌రింత సాయానికి ముందుకు వ‌స్తున్నారు. ఫ్యాన్స్ లో చాలా మంది నీటిలో నిలబడి ఉన్నారు. వ‌ర‌ద నీటిలో పని తర్వాత, పాదాలను పసుపు పొడి కొబ్బరి నూనెతో శుభ్రం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఓ వైపు గాయ‌మై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సూర్య త‌న స్వ‌స్థ‌లం చెన్నై మునిగిపోవ‌డంపై స్పందించ‌డం, అభిమానుల స‌హాయం కోర‌డం అత‌డి సేవాత‌త్ప‌ర‌త‌కు చిహ్నం. సూర్య‌- జ్యోతిక జంట చాలా కాలంగా ప‌లు ర‌కాల సామాజిక సేవాకార్య‌క్ర‌మాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.