అక్క..వదిన పాత్రలకు వరలక్ష్మి రెడీ!
'ఇప్పటి వరకూ అలాంటి పాత్రలు రాకపోవడం వల్లే చేయలేదు గానీ..వస్తే ఎందుకు వదలుకుంటాను. అలాంటి పాత్రలు చేయటానికి కూడా నాకు అభ్యంతరం లేదు.
By: Tupaki Desk | 14 April 2024 9:30 AM GMTశరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కొలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిశ్రమ ఆమెని విలనీగా గుర్తించింది. హీరోయిన్ గా కంటే ప్రతి నాయకురాలిగా ఆమె గొప్పగా సూటవు తుందని భావించి పరిశ్రమ ఆ రకమైన అవకాశాలతో ప్రోత్సహిస్తుంది. అమ్మడికి హీరోయిన్ గా కంటే ఎక్కువ గుర్తింపు ఆ తరహా పాత్రలతోనే వచ్చిందన్నది వాస్తవం. దీంతో టాలీవుడ్ లోనూ మొన్నటివకూ అదే తరహా పాత్రలు పోషించింది.
అయితే ఈ మధ్య కాలంలో పంథా మార్చినట్లు కనిపిస్తోంది. పాజిటివ్ రోల్స్...మెయిన్ లీడ్స్ లోనూ నటిస్తోంది. అయితే ఇలాంటి పాత్రలు ప్రతీసారి రావడం కష్టం. ఇవన్నీ వరలక్ష్మి ఇమేజ్ మీద ఆధారపడి చేసే పాత్రలు. ఫాంలో ఉన్నంత కాలం బండి బాగానే ముందుకెళ్తుంది. అవకాశాలు తగ్గిన సమయంలో పరిస్థితి ఏంటి? అంటే వరలక్ష్మి అన్ని రకాలుగా సిద్దపడే టాలీవుడ్ లో లాంచ్ అయినట్లు తెలుస్తోంది. అక్క..వదిన అలాంటి పాత్రలైనా ఎలాంటి సమస్యా లేదంటోంది.
'ఇప్పటి వరకూ అలాంటి పాత్రలు రాకపోవడం వల్లే చేయలేదు గానీ..వస్తే ఎందుకు వదలుకుంటాను. అలాంటి పాత్రలు చేయటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నా దృష్టిలో ఏదైనా పనే! అది చిన్నది కావచ్చు.. పెద్దది కావచ్చు.. ఎప్పుడూ నటిగా నా పరిధిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటా. భాష గురించి ఏ రోజు ఆలోచించలేదు అంది. ఇంట్రెస్టింగ్ గా అనిపించే పాత్ర ఏ భాష నుంచి వచ్చినా చేసుకుంటూ వెళ్లిపోతున్నా.
హిందీ నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఏది ఆసక్తిగా అనిపించకపోవడంతో అక్కడ ఇంకా సినిమాలు చేయలేదు' అని అంది. ఇప్పటికే 'హనుమేన్' సినిమాలో అక్క పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించింది. 300 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం. ఆ రకంగా వరలక్ష్మి కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వరలక్ష్మి చేతిలో కొన్ని పెద్ద చిత్రాలే ఉన్నాయి. అయితే తెలుగులో సక్సెస్ అవ్వడానికి కారణంగా క్రాక్ లోని నెగిటివ్ రోల్. ఆపాత్రతోనే అమ్మడు టాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అయింది.