Begin typing your search above and press return to search.

పందెంకోడి పెళ్లి తేదీ- వెన్యూ వివ‌రాలు లీక్

తాజా స‌మాచారం మేర‌కు వ‌ర‌ల‌క్ష్మి పెళ్లి వేడుక కోసం థాయ్‌లాండ్‌లో అద్భుత‌మైన రిసార్ట్ ని లాక్ చేసార‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 3:00 PM GMT
పందెంకోడి పెళ్లి తేదీ- వెన్యూ వివ‌రాలు లీక్
X

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త‌న స్నేహితుడు నికోల‌స్ స‌చ్‌దేవ్ ని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. గత వారం రోజులుగా కోలీవుడ్‌లోని ప్రముఖులందరినీ తన వివాహానికి హాజరు కావాల్సిందిగా వ‌ర‌ల‌క్ష్మి స్వ‌యంగా ఆహ్వానిస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, నయనతార, విఘ్నేష్ శివన్, సిద్ధార్థ్‌లను ఇప్ప‌టికే వ‌ర‌ల‌క్ష్మి ఆహ్వానించింది. విజయ్, కీర్తి సురేష్, శృతి హాసన్, మాధవన్, విజయ్ సేతుపతిలను ఆహ్వానించనుందని స‌మాచారం. అలాగే తెలుగు నుంచి ప‌లువురు స్టార్ల‌ను కూడా వ‌ర‌ల‌క్ష్మి ఆహ్వానిస్తుంద‌ని ఊహిస్తున్నారు.

వ‌రూ జూలై 2 న వివాహం చేసుకోనుంది. పెళ్లి తేదీ - లొకేషన్ వివ‌రాల్ని ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది. తాజా స‌మాచారం మేర‌కు వ‌ర‌ల‌క్ష్మి పెళ్లి వేడుక కోసం థాయ్‌లాండ్‌లో అద్భుత‌మైన రిసార్ట్ ని లాక్ చేసార‌ని తెలిసింది. ప్ర‌స్తుతానికి ఈ వెన్యూ వివ‌రాల‌ను సీక్రెట్ గా ఉంచార‌ట‌. వ‌ర‌ల‌క్ష్మి ప్రీవెడ్డింగ్ వేడుక‌లైన‌ మెహందీ, హల్దీ ఇతర ఆచారాలను చెన్నైలో పూర్తి చేస్తారు. అయితే థాయిలాండ్‌లో ముఖ్యమైన వివాహ వేడుక జ‌రుగుతుంది. అటుపై రిసెప్షన్ ఉంటుంది. థాయ్‌లాండ్‌లో పెళ్లి తర్వాత చెన్నైలో కూడా మ‌రో రిసెప్షన్‌ను ఘ‌నంగా నిర్వహించనున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

వరలక్ష్మి- నికోలాయ్ సచ్ దేవ్‌ల నిశ్చితార్థం మార్చి-1న ముంబైలో జరిగింది. మరోవైపు వరలక్ష్మి 2012లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన `పోడ పోడి` అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేసింది. వ‌ర‌ల‌క్ష్మి అద్భుత‌ నటనా నైపుణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ రంగాల్లో గుర్తింపు సంపాదించింది. వ‌రూ ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహిస్తున్న `రాయన్`లో న‌టించింది. ఈ చిత్రం విడుదల కోసం వేచి ఉంది. జూలై 26 న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. వ‌ర‌ల‌క్ష్మి త‌న పెళ్లికి త‌న పందెంకోడి 2 స్టార్ విశాల్ ని ఆహ్వానిస్తోందా లేదా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.