డబ్బు కోసం రోడ్డుపై డ్యాన్స్ వేసిన వరలక్ష్మీ శరత్ కుమార్
తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 10 March 2025 11:00 PM ISTతమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండానే సౌత్ లో ఫేమస్ నటిగా ఎదిగింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన పోడా పోడి సినిమాతో వరలక్ష్మీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
శంభు హీరోగా నటించిన ఈ సినిమా సరిగా ఆడకపోయినప్పటికీ వరలక్ష్మీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తారైతప్పట్టై సినిమాలో వరలక్ష్మీకి ఛాన్స్ వచ్చింది. నటిగా ఆ సినిమాతో వరలక్ష్మీ మరింత క్రేజ్ సంపాదించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది వరలక్ష్మీ.
అయితే వరలక్ష్మి కేవలం హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తూ తన సత్తా చాటుతున్న వరలక్ష్మీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ లో తనదైన ముద్ర వేసుకుంది. హనుమాన్ సినిమా తర్వాత వరలక్ష్మీ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగింది.
తన ఫ్రెండ్ నికోలాయ్ సచ్‌దేవ్ ను ప్రేమించి గతేడాది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వరలక్ష్మీ ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపిస్తుంది. రీసెంట్ గా వరలక్ష్మి భర్తతో కలిసి ఓ డ్యాన్స్ షో కు హాజరైంది. ఆ షోలో ఓ ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మహిళ అదరగొట్టే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆమె డ్యాన్స్ చూసి షాకైపోయిన వరలక్ష్మీ తాను ఇప్పటివరకు ఎక్కడా రివీల్ చేయని ఓ విషయాన్ని బయటపెట్టింది. గతంలో తాను కూడా రోడ్డు మీద డ్యాన్స్ చేసిన సందర్భాలున్నాయని, ఇండస్ట్రీలోకి రాకముందు రూ.2500 కోసం ఫస్ట్ టైమ్ ఒక డ్యాన్స్ షో కోసం రోడ్ లో డ్యాన్స్ వేశానని, రోడ్స్ పై డ్యాన్స్ వేయడాన్ని ఎవరూ తప్పుగా భావించొద్దని వరలక్ష్మీ తెలిపింది.