నాకు పెళ్లి అసలు సెట్ అవదనుకున్నా: వరలక్ష్మీ శరత్‌కుమార్
పెళ్లి తర్వాత అందరి జీవితం మారుతుందంటారు కానీ పెళ్లయ్యాక కూడా తన జీవితంలో పెద్ద మార్పులేమీ రాలేదని, కానీ నికోలయ్ లైఫ్ లో మాత్రం చాలా మార్పులొచ్చినట్టు వరలక్ష్మీ తెలిపింది.
By: Tupaki Desk | 31 Jan 2025 7:30 PM GMTవరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి, ఆమె నటన గురించి, తన టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తనకు ఎప్పటినుంచో పరిచయమున్న నికోలయ్ సచ్దేవ్ ను ప్రేమించి, ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నానంటున్న వరలక్ష్మీ, ముందు తనకసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదని, పెళ్లనేది తనకు అసలు సెట్ అవదనుకునేదాన్నని చెప్తోంది. కానీ తనకు నికోలయ్ తో పరిచయం ఏర్పడ్డాక, అతడే తనకు కరెక్ట్ పార్టనర్ అని అర్థమై, ఆ తర్వాత ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నాక పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది.
పెళ్లి తర్వాత అందరి జీవితం మారుతుందంటారు కానీ పెళ్లయ్యాక కూడా తన జీవితంలో పెద్ద మార్పులేమీ రాలేదని, కానీ నికోలయ్ లైఫ్ లో మాత్రం చాలా మార్పులొచ్చినట్టు వరలక్ష్మీ తెలిపింది. నికోలయ్ తన కోసమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్టు చెప్పిన ఆమె, అతని పేరుని కూడా నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నట్టు తెలిపింది.
అంతే కాదు, కెరీర్ పరంగా తనింకా ఎన్నో సాధించాలని నికోలయ్ తాపత్రయ పడుతుంటాడని, వర్క్ విషయంలో తనని ఎంతో ఇన్స్పైర్ చేస్తుంటాడని వరలక్ష్మి వెల్లడించింది. పెళ్లి జీవితం ఇంత బావుంటుందని తానెప్పుడూ అనుకోలేదని, తన భర్త నికోలయ్ వల్లనే తాను ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నట్టు వరలక్ష్మీ వెల్లడించింది.
ఇక సినిమాల పరంగా చూసుకుంటే గతేడాది హనుమాన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న వరలక్ష్మీకి ఆ సినిమా తర్వాత నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అమ్మడికో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఆదిపర్వం డైరెక్టర్ సంజీవ్ దర్శకత్వంలో వరలక్ష్మీ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చేయనుందని, అందులో వరలక్ష్మినే మెయిన్ లీడ్ గా నటించనుందని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.