హబ్బీ సచ్దేవ్తో వరలక్ష్మి శరత్ కుమార్ సెలబ్రేషన్!
ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను వరలక్ష్మి తన ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 2 Nov 2024 4:30 PM GMTఈసారి దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కేవలం బాలీవుడ్ లోనే కాదు, ఇటు సౌత్ సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇక మోడల్ కం బాడీ బిల్డర్ నికోయి సచ్ దేవ్ ని పెళ్లాడిన వరలక్ష్మి శరత్ కుమార్ తొలి దీపావళి వేడుకను సంబరంగా జరుపుకుంది. దీపావళి సెలబ్రేషన్ కోసం ముంబై నుంచి అల్లుడు సచ్ దేవ్ అత్తమామలైన రాధిక - శరత్ కుమార్ ఇంటికి విచ్చేసారు. కుటుంబ సమేతంగా అతడు అత్తమామల ఇంట అడుగుపెట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. దివ్వెల పండుగలో అతడు చాలా సంతోషంగా కనిపించగా, అందరినీ ఆట పట్టిస్తూ వరలక్ష్మి కూడా ఎంతో ఆనందంగా కనిపించింది.
ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను వరలక్ష్మి తన ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఉత్తరాది - దక్షిణాది బాండింగ్ అయినా కానీ, రెండు కుటుంబాల మధ్య అన్నీ కలిస్తే ఎంత ఆనందం వెల్లివిరుస్తుందో ఈ ఇరు కుటుంబాలు స్పష్ఠం గా చెబుతున్నాయి. వారి కుటుంబాల బంధువుల కళ్లలో ఆనందం ప్రతిదీ చెబుతోంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియో అంతర్జాలంలోకి దూసుకెళుతోంది.
నికోలయ్ సచ్ దేవ్ గురించి...
వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్దేవ్ ముంబైకు చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్. అతడు ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు. నికోలయ్ సచ్దేవ్ ఆన్లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. అతడు ఎవరన్నది నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సౌత్ కి కూడా తెలిసింది. వీరి నిశ్చితార్థ వేడుక ముంబయిలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. తర్వాత అదే ఏడాది చివరిలో పెళ్లయింది.
నటి వరలక్ష్మికి సచ్ దేవ్ తో అతడి కుటుంబంతో గత పద్నాలుగేళ్లుగా పరిచయం సత్సంబంధాలున్నాయి. కొన్నేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లాడారు. నికోలాయ్ సచ్దేవ్ కి బాలీవుడ్ లో మంచి పరిచయాలున్నాయి. అతడికి జాన్ అబ్రహం, సుస్మితా సేన్ సహా ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు. నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు. అతడి శరీరం నిండా టాట్టూలు దర్శనమిస్తున్నాయి. అతడు బాడీబిల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పెళ్లయాక సైలెన్స్ దేనికి వరూ?
వరలక్ష్మి పెళ్లికి ముందు నటిగా చాలా బిజీగా ఉంది. టాలీవుడ్ కోలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. కానీ పెళ్లి తర్వాత ఎందుకనో సైలెంట్ అయిపోయింది. ఈ బ్యూటీ తిరిగి నటిస్తుందా లేదా? వేచి చూడాలి.