అప్పుడే వరలక్ష్మి భర్తని కొంగున ముడేసిందా?
అందరూ అనుకున్నట్లే పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్ కుమార్ సచ్ దేవ్ గా మార్చుకోవడం లేదు.
By: Tupaki Desk | 16 July 2024 7:04 AM GMTవరలక్ష్మి-ముంబైకి చెందిన నికోలాయ్ సచ్ దేవ్ ప్రేమించి పెద్దల సమక్షంలో ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జోడీ హనీమూన్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా వరలక్ష్మిపై తనకున్న ప్రేమనంతటి నికోలాయ్ చాటాడు. వివాహం తర్వాత తొలిసారి చెన్నై మీడియాతో నికోలాయ్ సచ్ దేవ్ మాట్లాడారు. ' నేను కూడా తమిళ్ నేర్చుకుంటున్నా. నాకు తమిళ్ లో తెలిసిన ఒకే ఒక్క పదం పొంతటి అంటే భార్య అని. ఇక నుంచి నా ఇల్లు ముంబై కాదు చెన్నై. నన్ను మీకు పరిచయం చేయాలనుకుంటున్నా.
నా పేరు నికోలాయ్ సచ్ దేవ్. నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లి అయింది. అందరూ అనుకున్నట్లే పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్ కుమార్ సచ్ దేవ్ గా మార్చుకోవడం లేదు. నాకు కూడా ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ గానే నచ్చింది. కానీ నేను మాత్రం ఆమె పేరును తీసుకుం టున్నాను. ఇక నుంచి నా పేరు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ గా మార్చుకుంటున్నా.
శరత్ కుమార్, వరక్షలక్ష్మి కీర్తి నా సొంతం. వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నా ఆమె ఫస్ట్ లవ్ నేను కాదు. ఆమెకి ఎప్పుడు ఫస్ట్ లవ్ సినిమాలు మాత్రమే. పెళ్లి తర్వాత కూడా నటిస్తుంది. గతంలో మాదిరే అందరి ప్రేమాభిమానాలు మాకు అవసరం' అని అన్నారు. అలాగే వరలక్ష్మి ఏమన్నారంటే? ' సినిమాల్లో యధా విధిగా కొనసాగుతాను. నా జీవితం సినిమాతోనే ముడి పడి ఉంటుంది.
నాకు నచ్చిన వృత్తిలో ఎంత కాలమైనా కొనసాగుతాను. భర్త నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉంది' అని అంది. మొత్తానికి అమ్మడు భర్తని కొంగుని బాగానే ముడేసినట్లు కనిపిస్తుందంటూ ఓ నెటి జనుడు సరదా కామెంట్ పెట్టాడు. ముంబైకి చెందిన నికోలాయ్ సచ్ దేవ్ బిజినెస్ మ్యాన్. ముంబైలో భారీగా ఆస్తు లున్నట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.