ఎవరికోసమో కాదు నాకోసం నాకు నచ్చినట్టుగా..!
కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నారు
By: Tupaki Desk | 9 May 2024 6:23 AM GMTకోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నారు. తమిళంలో ఆమె మొదట్లో హీరోయిన్ గా చేసిన ఆమె కెరీర్ లో కొద్దిగా వెనక పడగా ఆ టైం లోనే తెలుగు తెరకు పరిచయమైంది. స్టార్ తనయురాలైన ఆమె చేస్తే హీరోయిన్ గానే చేయాలి అన్న కండీషన్స్ ఏమి పెట్టుకోకుండా సినిమాను నడిపించే ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధం అని ఫిక్స్ అయ్యింది అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ ని వెతుక్కుంటూ పాత్రలు వస్తున్నాయి. వెండితెర మీద లేడీ విలన్, నెగిటివ్ రోల్స్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు.
నెగిటివ్ గా చేస్తే మళ్లీ నెక్స్ట్ అవకాశాలు వస్తాయో రావో అన్న భయంతో కొందరు అలాంటి పాత్రలు చేయరు. కానీ నటీమణిగా తను ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయినా చేసేందుకు రెడీ అంటుంది వరలక్ష్మి. క్రాక్ సినిమాలో ఆమె పాత్ర సూపర్ హిట్ కాగా ఆ క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. లేటెస్ట్ గా శబరి అంటూ మరో క్రేజీ అటెంప్ట్ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సినిమా ప్రమోషన్స్ లో మ్యారేజ్ అనేది నచ్చిన వారిని నచ్చిన టైం లో చేసుకోవాలని అంటున్నారు.
ఎవరికోసమో కాదు తన కోసం తనకు నచ్చినట్టుగా బ్రతికే స్వేచ్చ ఉండాలని. తన వరకు అయితే తనకు ఏది చేయాలని అనిపిస్తే అది చేస్తా.. అందుకే నికోలే సచ్దేవ్ కూడా తనకు నచ్చడం వల్లే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అని ఆలోచించలేదని అన్నారు. అంతేకాదు సెలబ్రిటీస్ లైఫ్ లో జరిగే కొన్ని విషయాలను బయట చర్చించడం వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుందని అంటున్నారు వరలక్ష్మి శరత్ కుమార్.
నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు కామెంట్స్ చేసే వ్యక్తి గురించి మీకు ఏం తెలుసన్నది ఆలోచించాలి. హీరోయిన్స్ కి తక్కువ పారితోషికం తీసుకుంటారు.. వారు కూడా వారి స్టాఫ్ కు సాలరీస్ ఇవ్వాల్సి ఉంటుందని. సినిమాలు లేకపోతే డబ్బులు ఉండవని.. ఆ కష్టాల గురించి ఎవ్వరికీ తెలియదని చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. సెలబ్రిటీస్ అంతా పైకి కనిపించడానికి బాగానే ఉంటారు. కానీ వారికి ఉన్న సమస్యలు ఏంటనేవి తెలుకోవడం కష్టం. అలా కాకుండా సెలబ్రిటీ అయినంత మాత్రాన వారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు వరలక్ష్మి శరత్ కుమార్.