వరలక్ష్మి కాబోయే వాడికి టీనేజీ డాటర్!
తన పెళ్లికి ముందు తన కుటుంబంతో కలిసి వరూ షాపింగ్‌కు వెళ్లింది.
By: Tupaki Desk | 19 Jun 2024 4:50 AM GMTనటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన తండ్రి శరత్‌కుమార్, ఆమె కాబోయే భర్త నికోలాయ్ సచ్‌దేవ్, అతని టీనేజ్ కుమార్తె కాషా నియా సచ్‌దేవ్‌తో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. వరూ తమ వివాహ షాపింగ్ ట్రిప్ నుండి కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలాయ్ సచ్‌దేవ్ వివాహం జూలైలో అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం.
తన పెళ్లికి ముందు తన కుటుంబంతో కలిసి వరూ షాపింగ్‌కు వెళ్లింది. వీడియోలలో ఒక దానిలో శరత్‌కుమార్ తన అల్లుడు, అతడి కుమార్తెతో చక్కని బంధాన్ని కలిగి ఉండడం కనిపిస్తోంది. మరొక వీడియోలో వరలక్ష్మి, శరత్‌కుమార్, నికోలాయ్..కాషా దుబాయ్‌లోని ఒక మాల్‌లో విహరిస్తూ కనిపించారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్, కమల్ హాసన్ ఇళ్లకు వెళ్లి వారిని ఆహ్వానించారు. వరలక్ష్మి మరియు నికోలాయ్ ఈ సంవత్సరం మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం కోలీవుడ్, టాలీవుడ్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలందరి సమక్షంలో గ్రాండ్ ఈవెంట్‌గా జరగనుంది.
ఇది నికోలాయ్ కి రెండవ వివాహం. కాషా అతడి మొదటి భార్య కుమార్తె. ప్రస్తుతం స్టడీస్ కొనసాగిస్తున్న ఈ టీనేజీ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వరూ కాబోయే భర్త వివరాలు:
శరత్ కుమార్ కి కాబోయే అల్లుడి వివరాల్లోకి వెళితే...అతడి పేరు నికోలయ్ సచ్‌దేవ్. ముంబైకు చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్. తను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు. నికోలయ్ సచ్‌దేవ్ ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. అతడు ప్రముఖ దక్షిణ భారత నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వార్తల్లో నిలిచారు.
నటి వరలక్ష్మికి అతనికి గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. నికోలాయ్ సచ్‌దేవ్ కి బాలీవుడ్ లో మంచి పరిచయాలున్నాయి. అతడికి జాన్ అబ్రహం, సుస్మితా సేన్ సహా ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు. నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు. అతడి శరీరం నిండా టాట్టూలు దర్శనమిస్తున్నాయి. అతడు బాడీబిల్డర్ కూడా.