యానిమల్ పై మరోసారి చెలరేగిన వర్మ
యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
By: Tupaki Desk | 10 Dec 2023 11:54 AM GMTయానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 1000 కోట్లు వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా పై విమర్శల..ప్రశంసల గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ సంచలనాల రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం గురించైతే మాటల్లో చెప్పడం సాధ్యం కానిది. `యానిమల్` సినిమా తనకెంతగా నచ్చిందో మొదటి పోస్ట్ లోనే చెప్పేసారు. అయినా అతనికి సంతృప్తిక కలగలేదు. ఇంకా `యానిమల్` గురించి చెప్పాలనిపిచిందో? ఏమో తాజాగా మరోసారి `యానిమల్` పై వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు.
`ఈ రోజు నుంచి ఇంతకు ముందు అనుకున్న విధంగా భారతీయ చలన చిత్రాలుండవు. సినిమాలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో? ఎవరికీ తెలియదు. మంచి చెడు..నైతికత..విశ్వసనీయత..ఇతర కుటుంబ..సామాజిక విలువలు యానిమల్ అనే ఫిల్మ్ స్కూల్లో నేర్చుకోవాలి. అన్ని ఫిల్మ్స్ స్కూల్స్ సిలబస్ ని తక్షణమే రద్దు చేయాలి. భవిష్యత్ విద్యార్ధులకు యానిమల్ లా సినిమా చేయడం ఎలా? అనేది నేర్పించాలి. ఎవరైనా సరే సినిమా చెత్తగా ఉందని చెప్పినా సినీ నిర్మాతలందరూ ఎవరు మాట వినకూడదు.
మీలో ని యానిమల్ ని బయటకు తీసుకురావాలి. యానిమల్ చూసాక ప్రేక్షకులు ఇకపై చిన్న పిల్లల చిత్రాల్ని చూడరని మేకర్స్ అంతా గమనించాలి అని అన్నారు. అలాగే విమర్శకుల కోసం ఇవి అంటూ... `భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన సినిమాకు అత్యంత అద్వానంగా రివ్యూలు ఇవ్వడం..సినీ విమర్శకులకు..సినిమా బాక్సాఫీస్ కు తేడా లేదని రుజువైంది. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారో? నిజంగా సినీ క్రిటిక్ కి తెలియదు. అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించడంతో మొదటిసారి ఫిల్మ్ మేకర్ కంటే విమర్శకులు అప్ సెట్ అయ్యారు.
విమర్శకులు తమ ప్రమాణాల్ని మెరుగు పరుచుకోవడానికి పదే పదే యానిమల్ చూడాల్సిందే. ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సులు నిర్వహించాలని సినీ విమర్శకులంతా చేతులెత్తి సందీప్ అని అభ్యర్దించాలి అన్నారు. అలాగే భారత ప్రజల కోసం ఇలా.. `భారతీయులంతా ఒకేలా ఉండరు. మరి మునుపటి భారతీయులు ఏమనుకుంటున్నారో? సినిమాలు ఒక కళారూపమని..సంస్కృతిని ప్రతిబింస్తాయని విశ్వషిస్తే.. అంతకు ముందు కళగా పిలవబడే దాన్నే యానిమల్ నాశనం చేసింది.
మనలో ఎలాంటి జంతువులు దాగి ఉన్నాయో ఇప్పుడు ప్రతీ ఇండియన్ కి మరొకరి రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇండియన్స్ దర్శకుడిని గౌరవిస్తారని మెగా బాక్సాఫీస్ నిరూపించింది. ప్రస్తుతం భారతీయులంతా ఎదిగారని గ్రహించాలి. ఇకపై ఇండియన్ సినిమాని రెండు భాగాలుగా విభజించాలని అని ట్వీట్ చేసారు.