Begin typing your search above and press return to search.

రీ-రిలీజ్ వేళ వ‌ర్మ తెంచిన‌ సైకిల్ చైన్!

నేటికి శివ అనే బ్రాండ్ తోనే ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు అందుకుటున్నారు? అంటే అతిశ‌యోక్తి కాదు.

By:  Tupaki Desk   |   30 May 2024 5:48 PM GMT
రీ-రిలీజ్ వేళ వ‌ర్మ తెంచిన‌ సైకిల్ చైన్!
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన 'శివ‌' చ‌రిత్ర గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క సినిమాతోనే వ‌ర్మ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. నేటికి శివ అనే బ్రాండ్ తోనే ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు అందుకుటున్నారు? అంటే అతిశ‌యోక్తి కాదు. అంత గొప్ప జీవితాన్ని సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌ర్మ‌కి శివ అందించింది. అందుకే వ‌ర్మ ఎప్పుడూ ఇలా అంటుంటాడు.

నేను మంచోడిని కాక‌పోయినా..నాగార్జున అనే మంచి వాడు నాకు దొరికాడు కాబ‌ట్టే శివ అనే అద్భుతం వ‌చ్చింద‌ని ఎంతో గ‌ర్వంగా..గొప్ప‌గా చెబుతుంటారు.ఇక ఈ సినిమా త‌ర్వాత నాగార్జున రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. అందులో ఒక్క సీన్ లో సైకిల్ చైన్ తెంచి చేసిన ఫైట్ తో టాలీవుడ్ లో అత‌డి స్థాయే మారిపోయింది. నాగార్జున‌కు సరికొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా అది. అప్ప‌టి యుత్ కి ఐకాన్ లా మారిపోయారు.

ఇప్ప‌టికీ ఆ సీన్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ లాంటిందే. అయితే ఇప్పుడీ చిత్రాన్ని వ‌ర్మ మ‌ళ్లీ రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అతి త్వ‌ర‌లోనే 4కె పార్మెట్ లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా పోస్ట్ చేసారు. ఇందులో రాంగో పాల్ వ‌ర్మ సైకిల్ చైన్ లాగి చేతికి బిగిస్తాడు. నాగార్జున ఎక్స్ ప్రెష‌న్ తో స‌రిగ్గా మ్యాచ్ అయ్యేలా ఆ సీన్ చేసాడు. అప్ప‌టి వాతావ‌ర‌ణం ఎక్క‌డా చెక్కు చెద‌ర కుండా ఎంతో నేచుర‌ల్ గా ఈ సీన్ ఏఐ టెక్నాల‌జీతో రీక్రియేట్ చేసినట్లు తెలుస్తుంది.

ఈసీన్ తో నిజంగా వ‌ర్మ ఓ 30 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లాడు అనిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. వ‌ర్మ అభిమానులు ఆ వీడియో చూసి పిచ్చెక్కిపోతున్నారు. రీ-రిలీజ్ ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని? ఎప్పుడో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అని పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. మ‌రి ఆ వ‌సూళ్ల రికార్డును శివ బ‌ద్ద‌ల‌కొడుతుందా? అన్న‌ది చూడాలి.