Begin typing your search above and press return to search.

‘S/O సత్యమూర్తి' బేబీ అప్పుడే ఇంత పెద్దగానా...!

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 5:58 AM GMT
‘S/O సత్యమూర్తి బేబీ అప్పుడే ఇంత పెద్దగానా...!
X

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ అన్నయ్య కూతురుగా కనిపించిన పాప అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.


సన్నాఫ్ సత్యమూర్తి విడుదల అయ్యి పదేళ్లు కావస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ పాప ఎలా ఉండి ఉంటుంది, ఎంత పెద్దది అయ్యింది అనే విషయాలో అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్‌ నటించిన ఒక సినిమాలో బాల నటిగా చేసిన అమ్మాయి ఇప్పుడు హీరోయిన్‌ గా నటిస్తుంది.

ఇప్పుడు సత్యమూర్తి సినిమాలో బన్నీ తో కలిసి నటించిన బాల నటిగా నటించిన వర్ణిక ఇప్పుడు పెద్ద అమ్మాయి అయ్యింది. రెండు మూడు ఏళ్లలో వర్ణిక హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా తాజాగా ఆమె చేసిన సోషల్‌ మీడియా వీడియోను చూస్తుంటే అనిపిస్తుంది.

వర్ణిక తాజాగా ట్రెండ్‌ అవుతున్న పుష్ప 2 సినిమా సూసేకి పాటకు స్టెప్స్‌ వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బన్నీ బాబాయి పాటకు ఇలా వర్ణిక డాన్స్ చేయడం అందరిని ఆకర్షించింది. కచ్చితంగా ముందు ముందు వర్ణిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తుంది. సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. అయితే రిలీజ్ డేట్‌ మారే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.