జిమ్ లో వర్ష హార్డ్ వర్క్.. స్టన్నింగ్ లుక్
సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి వర్ష బొల్లమ్మ.
By: Tupaki Desk | 14 Sep 2024 3:30 PMసౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి వర్ష బొల్లమ్మ. సతురన్ అనే తమిళ్ మూవీతో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత కళ్యాణం అనే చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో చూసి చూడంగానే సినిమాతో వర్ష తెలుగులోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మూడు భాషలలో కూడా వర్ష బొల్లమ్మకి యాక్టర్ గా మంచి ఇమేజ్ ఉంది.
ఆమె చేసిన ప్రతి సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలలోనే వర్ష కనిపించింది. ఆమె తన నటనతోనే ప్రేక్షకుల ప్రశంసలు సొంతం చేసుకొని అవకాశాలు దక్కించుకుంటుంది. వర్ష బొల్లమ్మ చివరిగా ఊరు పేరు భైరవకోన సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం అయితే వర్ష చేతులో పెద్దగా సినిమాలు లేవు.
అయిన కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా వర్ష తన అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో వర్షకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ కంటే డిఫరెంట్ స్టైల్ లో తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూ ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు జిమ్ లో వర్క్ అవుట్స్ చేసిన తర్వాత అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. ఈ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో వర్ష చాలా స్లిమ్ గా కనిపిస్తోంది. పేస్ లో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ పెట్టి సెల్ఫీకి ఫోజులిచ్చింది. ఈ పిక్ పై ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫన్నీ ఫోటోలని వర్ష రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది.