Begin typing your search above and press return to search.

ఆ హీరోతో పెళ్లి.. లైవ్ లో చెక్ పెట్టిన హీరోయిన్

ఇటీవల కాలంలో తెలుగులో కొంతమంది హీరోయిన్లు బడా నిర్మాతల కోడళ్లుగా సెటిల్ అయిపోతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Feb 2024 6:07 PM GMT
ఆ హీరోతో పెళ్లి.. లైవ్ లో చెక్ పెట్టిన హీరోయిన్
X

ఇటీవల కాలంలో తెలుగులో కొంతమంది హీరోయిన్లు బడా నిర్మాతల కోడళ్లుగా సెటిల్ అయిపోతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నాగళ్ల పై కూడా అలాంటి ప్రచారమే వచ్చింది. 'మల్లేశం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తీచ్చుకున్న అనన్యకు వరుసగా పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

అలాంటి టైమ్ లో అనన్య ఓ నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్ళిపోతుందని, తక్కువ టైమ్ లోనే జాక్ పాట్ కొట్టిందని వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. దానిపై ఆమె కూడా స్పందించలేదు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో 'స్వాతిముత్యం' సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో రిలేషన్ లో ఉందని, వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ న్యూస్ వచ్చినప్పుడు వర్షా ఫన్నీ గా రియాక్ట్ అయింది. ఇక తాజాగా మరోసారి 'ఊరు పేరు భైరవకోన' ప్రమోషన్స్ లో ఇదే విషయంపై స్పందించింది.

విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఫిబ్రవరి 16 విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లిపై వచ్చిన రూమర్స్ గురించి వర్ష స్పందిస్తూ.." మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఇద్దరం కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ, నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వడం, తన పోస్ట్ కి నేను రియాక్ట్ అవ్వడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది.

పొగ లేనిదే నిప్పురాదని అంటారు కదా. అలా.. కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండా ఆ వార్తలు విని షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్ అంతే.. కానీ మా మధ్య ఇలాంటి రూమర్ విని షాక్ అయ్యా.. తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చా" అంటూ చెప్పుకొచ్చింది.