Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్ 8 లీక్‌.. ఆ అందాల యాంకర్‌ ఇన్‌

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 July 2024 1:30 PM GMT
బిగ్‌బాస్ 8 లీక్‌.. ఆ అందాల యాంకర్‌ ఇన్‌
X

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఫైనల్‌ అయ్యారు. సోషల్‌ మీడియా సెలబ్రిటీలతో పాటు బుల్లి తెర మరియు వెండి తెర నుంచి కూడా ఈసారి ఎక్కువ మందిని తీసుకుంటారని తెలుస్తోంది.

ఇక ప్రతిసారి బుల్లి తెర యాంకర్‌ కి ఛాన్స్ ఇస్తూ వస్తున్న బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఈసారి ఆ స్థానంను అందాల యాంకర్‌ వర్షిణి భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా యూట్యూబర్‌ గా మంచి పేరు తెచ్చుకుని, ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన నిఖిల్ ను కూడా ఈసారి బిగ్‌ బాస్ వారు సంప్రదించారట.

ఇక బర్రెలక్క, అమృత ప్రణయ్‌ తో పాటు కుమారీ ఆంటీ కి కూడా ఛాన్స్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే కొత్త సీజన్ కి సంబంధించిన అగ్రిమెంట్‌ పై సైన్ చేయడం జరిగింది. మరో వైపు కొత్త సీజన్ కి సెట్‌ నిర్మాణం కూడా జరుగుతుందని మా టీవీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్‌ లో బిగ్‌ బాస్ సీజన్‌ 8ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కంటెస్టెంట్స్ విషయంలో గత సీజన్ లో మాదిరిగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీజన్ 1 తర్వాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్ ను సీజన్ 7 దక్కించుకుంది.

సీజన్‌ 7 విజయానికి ప్రధాన కారణం కంటెస్టెంట్స్.. అందుకే ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలను కొత్త సీజన్ కి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా బిగ్‌ బాస్‌ సీజన్ 8 ఉండే విధంగా కాన్సెప్ట్‌ ను ప్లాన్‌ చేస్తున్నారట.