సినిమాలో నటించిన స్టార్ క్రికెటర్... వైరల్ అవుతున్న పాత ఫోటోలు!
ఈ సమయంలో వరుణ్ పాత ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.
By: Tupaki Desk | 12 March 2025 4:00 PM ISTటీం ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపులో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కంగారు పెట్టించి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్ చక్రవర్తి ఈ మధ్య కాలంలో టీం ఇండియాకు అత్యంత కీలక బౌలర్‌గా మారుతున్న విషయం తెల్సిందే. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ రావడంలో కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో వరుణ్ పాత ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.
వరుణ్ చక్రవర్తి ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకోని సమయంలో ఒక తమిళ్ మూవీలో నటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన 'జీవా' సినిమాలో వరుణ్ కనిపించాడు. విష్ణు విశాల్ హీరోగా శ్రీ దివ్య హీరోయిన్‌గా నటించిన జీవా సినిమాను ఆర్య నటించాడు. జీవా సినిమాలో వరుణ చక్రవర్తి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఆ సినిమాలో వరుణ్ లుక్‌ను కొందరు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అప్పటి లుక్‌కి ఇప్పటి లుక్‌కి ఏమాత్రం పోలిక లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
టీం ఇండియాలో చోటు దక్కించుకున్న తర్వాత వరుణ్ చక్రవర్తి మొత్తం మారిపోయాడు. ముఖ్యంగా అతడి లుక్ హీరోలను మించి మారిందని కామెంట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఓకే అనాలే కానీ హీరోగా సినిమాలను నిర్మించేందుకు ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉంటారు. వరుణ్ చక్రవర్తి జీవా సినిమా తర్వాత మళ్లీ ఎప్పుడు వెండి తెరపై కనిపించలేదు. ఆ సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన విశేషాలను త్వరలోనే వరుణ్ చక్రవర్తి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి.
2014లో వచ్చిన జీవా సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. అయినా ఇప్పుడు ఆ సినిమాలో వరుణ్ చక్రవర్తి నటించాడనే ప్రచారం జరుగుతున్న కారణంగా ఓటీటీ ఇతర ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. మొత్తానికి జీవా సినిమాలో వరుణ్ చక్రవర్తి లుక్ సోషల్ మీడియాలో ప్రముఖంగా సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో జీవా సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎక్కడ చూడవచ్చు, సినిమా కథ ఏంటి, అందులో వరుణ్ చక్రవర్తి పాత్ర ఏంటి ఇలా అనేక రకాలుగా జనాలు సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు.